Chiranjeevi: బాబీ- చిరంజీవి కాంబో మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ?
మెగాస్టార్ చిరంజీవి పలు సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్‌లో ఉంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పలు సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా కరోనా వైరస్ ప్రభావంతో ఆగిపోయింది. ఇప్పటికే రిలీజైన ఆచార్య టీజర్ ష్యాన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో చిరంజీవి తనయుడు రాంచరణ్ కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు హైరేంజ్‌లో ఉన్నాయి. అయితే, ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్‌లో వేదాళం రీమేక్, మెహన్ రాజా తెరకెక్కించనున్న లూసీఫర్ రీమేక్‌తో పాటు బాబీ డైరెక్షన్‌లో ఓసినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా చిరు-బాబీ కాంబినేషన్‌లో రానున్న సినిమాపై ఓవార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సోనాక్షి సిన్హా నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి నటిస్తున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. సోనాక్షి సిన్హా ఇది వరకే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇతర కారణాలతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఆగిపోయింది. అయితే, ఈ వార్త కనుక నిజమైతే.. సోనాక్షి సిన్హా కు గ్రాండ్ ఎంట్రీ లభించినట్లేనని అనుకుంటున్నారు టాలీవుడ్ పెద్దలు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అయితే ఈ వార్తలు ఎంతమేరకు నిజమో తెలియదు. మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
అలాగే ఈ సినిమాపై రోజుకో రూమర్ వస్తూనే ఉంది. ఈ సినిమా ఠాగూర్ మాదిరిగా ఉండబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే గ్రామీణ నేపథ్యంలో ఎమోషనల్‌తో కూడిన ఫ్యామిలీ సీన్లతో తీర్చిదిద్దనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాకు వీరయ్య అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే, ‘ఆచార్య’లో సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో నటిస్తారని అంటున్నారు. కానీ, లూసిఫర్ కంటే ముందు బాబీ తెరకెక్కించే సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read:
Galla Ashok : కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం మొదటి హీరో ఎంట్రీ.. టైటిల్ టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు
CM YS Jagan – Chiranjeevi: చిరంజీవి ప్రశంసలకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్
Mangli: మాటకారి మంగ్లీ బ్యూటిఫుల్ ఫోటో గ్యాలరీ… క్యూట్ స్మైల్ కు ఫిదా అవుతున్న అభిమానులు…
Taapsee Pannu: భారతీయ చీరకట్టులో రష్యా వీధుల్లో తాప్సీ.. ‘దారులు అందమైనవే’ అంటూ ట్వీట్..