AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Galla Ashok : కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం మొదటి హీరో ఎంట్రీ.. టైటిల్ టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు

Galla Ashok : సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి తనయులు రమేష్ బాబు, మహేష్ బాబు హీరోగా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చారు. అయితే రమేష్ బాబు కంటే.. మహేష్ బాబు హీరోగా...

Galla Ashok : కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం మొదటి హీరో ఎంట్రీ.. టైటిల్ టీజర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు
Galla Ashok Mahesh
Surya Kala
|

Updated on: Jun 23, 2021 | 5:06 PM

Share

Galla Ashok : సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి తనయులు రమేష్ బాబు, మహేష్ బాబు హీరోగా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చారు. అయితే రమేష్ బాబు కంటే.. మహేష్ బాబు హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లోస్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక కృష్ణ కూతురు మంజుల కూడా నటి, నిర్మాత.. అంతేకాదు.. వారసులుగా కృష్ణ అల్లుడు సుధీర్ బాబు వెండి తెరపై అడుగు పెట్టి.. తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఇక కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం నటులు కూడా ఎంట్రీ ఇచ్చారు.. కృష్ణ తనయుడు గౌతమ్ తో పాటు మంజుల కూతురు కూడా నటించింది. అయితే ఇప్పడుసూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరంలో హీరోగా గల్లావారి వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు.

ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు.. మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టనున్నాడు. తాజాగా గల్లా అశోక్ ఫస్ట్ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ ను మహేష్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. అశోక్ మొదటి సినిమా కు సంబంధించినటీజర్ ను మహేష్ బాబు తన సోషల్ మీడియా వేడికాగా రిలీజ్ చేశాడు. ఈ సినిమా కు హీరో అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని మహేష్ బాబు కామెంట్ చేశారు. అశోక్ లుక్ కూడా బాగుందని.. ఇక హీరో జర్నీ కూడా మొదలు కానున్నదని చెప్పారు.

టైటిల్ టీజర్ లో గల్లా అశోక్ కౌబాయ్ లుక్ లో ఉన్నాడు. అంతేకాదు.. ఈ లుక్ లో అశోక్ టక్కరిదొంగలో మహేష్ బాబు ని గుర్తు చేస్తున్నాడు. హీరో మూవీని అమర్ రాజా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గల్లా అరుణకుమారి నిర్మిస్తుండగా యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందిస్తున్నారు. ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అశోక్‌ గల్లా సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ నటిస్తుండగా.. జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: అమ్మమ్మ చేతి కమ్మని వంట… కోడిగుడ్డుతో జున్ను కూర తయారీ ఎలా అంటే..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?