Skanda Movie: బోయపాటి మామూలోడు కాదు.. ఒక్క ఫైట్ కోసం కోట్లల్లో ఖర్చు చేశారట..
హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన స్కంద సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమాను కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తున్నాయి. రామ్ మాస్ అవతారంలో నటించి మెప్పించిన ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల నటించింది. రామ్ పోతినేని డిఫరెంట్ లుక్ లో కనిపించి మెప్పించారు. బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్ అనే చెప్పులి. రామ్ తెలంగాణ యాస లో మరోసారి డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను అలరించారు.

యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన స్కంద సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమాను కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తున్నాయి. రామ్ మాస్ అవతారంలో నటించి మెప్పించిన ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల నటించింది. రామ్ పోతినేని డిఫరెంట్ లుక్ లో కనిపించి మెప్పించారు. బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్ అనే చెప్పులి. రామ్ తెలంగాణ యాస లో మరోసారి డైలాగ్స్ చెప్పి ప్రేక్షకులను అలరించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం భారీగా ఖర్చు చేశారట మేకర్స్.
స్కంద సినిమాతో రామ్ పోతినేని తన కెరీర్ లోనే హైయెస్ట్ ఓపినింగ్స్ ను అందుకున్నాడు. ఇక వసూళ్ల పరంగా దూసుకుపోతున్న స్కంద సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కించనున్నారు బోయపాటి. ఇదిలా ఉంటే స్కంద సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఫైట్ కోసం భారీగా ఖర్చు చేశారట.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఈ విషయాన్నీ తెలిపారు. స్కంద సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సమయంలో దున్నపోతుతో ఫైట్ ఉంటుంది. ఈ ఫైట్ కోసం ఏకంగా 4.5 కోట్ల రూపాయలు ఖర్చైందని తెలుస్తోంది. అలాగే ఈ ఫైట్ కోసం 29 జనరేటర్లను ఉపయోగించారట. బోయపాటి సినిమాలో హీరోల ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు స్కంద సినిమా సీక్వెల్ కూడా రానుంది అంటూ సినిమా చివరిలో చూపించారు. అయితే స్కంద సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ రావడం కష్టమే అంటున్నారు కొందరు అభిమాను. ఇక రామ్ ప్రస్తుతం పూరిజగన్నాథ్ తో కలిసి డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
బోయపాటి శ్రీను ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
బోయపాటి శ్రీను ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
