Rashmi Gautam: జబర్దస్త్ రష్మీ గుడ్ బై చెప్పనుందా..? అసలు విషయం ఏంటంటే
ఈ కామెడీ షో కోసం జనాలు పనులు కూడా మానేసుకొని టీవీలకు అతుక్కు పోతారు అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది జబర్దస్త్. ఈ కామెడి షో రెండు భాగాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అందాల భామ అనసూయ ఒక ఎపిసోడ్ కు మరో బ్యూటీ రష్మీ గౌతమ్ మరో షో కు హోస్ట్ లుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆ తర్వాత జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకోవడంతో .. జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రష్మినే హౌస్ట్ గా వ్యవహరించింది. ఆ తర్వాత జబర్దస్త్ కు సౌమ్య రావు హౌస్ట్ గా చేస్తుండగా.. ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రష్మీ హౌస్ట్ గా చేస్తోంది.

టీవీ షోల్లో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న షో ఏది అంటే టక్కున చెప్పే పేరు జబర్దస్త్ అనే చెప్పాలి. కామెడీ స్కిట్స్ తో జబర్దస్త్ షో చాలా కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఈ కామెడీ షో కోసం జనాలు పనులు కూడా మానేసుకొని టీవీలకు అతుక్కు పోతారు అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది జబర్దస్త్. ఈ కామెడి షో రెండు భాగాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అందాల భామ అనసూయ ఒక ఎపిసోడ్ కు మరో బ్యూటీ రష్మీ గౌతమ్ మరో షో కు హోస్ట్ లుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆ తర్వాత జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకోవడంతో .. జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రష్మినే హోస్ట్ గా వ్యవహరించింది. ఆ తర్వాత జబర్దస్త్ కు సౌమ్య రావు హోస్ట్ గా చేస్తుండగా.. ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రష్మీ హౌస్ట్ గా చేస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు జబర్దస్త్ రష్మీ గుడ్ బై చెప్పనుంది టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి రష్మీ తప్పుకోనుందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో రష్మీ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే రష్మీ టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మెగాస్టార్ సినిమాలో మెరిసింది రష్మీ.
మెగాస్టార్ నటించిన భోళాశంకర్ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది రష్మీ. అయితే ఆమెకు ప్రస్తుతం వరుసగా సినిమా ఆఫర్స్ వస్తుండటంతో డేట్స్ అడ్జెస్ట్ కాకా జబర్దస్త్ షోనుంచి తప్పుకోవాలని భావిస్తుందని వార్తలు వైరల్ గా మారాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియదు కానీ రష్మీ అభిమానులు మాత్రం ఈ వార్త తెలిసి కాస్త కంగారు పడుతున్నారు. జబర్దస్త్ లో చేసే కామెడీ తో పాటు రష్మీ గ్లామర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె హోస్ట్ చేసే విధానం.. వచ్చి రాని ఆమె తెలుగు మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మరో జబర్దస్త్ నుంచి తప్పుకుంటున్నదన్న వార్తల పై రష్మీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
View this post on Instagram
రష్మీ గౌతమ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.