God Father: గాడ్ ఫాదర్ సినిమాలో చిరు తండ్రిగా నటించిన ఈ హీరోను గుర్తుపట్టారా ?..
ఇక ఈ తరం ప్రేక్షకులు మాత్రం ఆ నటుడిని గుర్తించలేకపోయారు. ఆయన మరెవరో కాదు.. సర్వదామన్ బెనర్జీ. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం గాడ్ ఫాదర్. మలయాళం సూపర్ హిట్ లూసీఫర్ చిత్రానికి అధికారిక రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు డైరెక్టర్ మోహన్ రాజా. దసరా కానుగా అక్టోబర్ 5న ప్రేక్షకుల్ ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో చిరుతోపాటు.. లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, మురళీ శర్మ, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలలో నటించి మెప్పించారు. అయితే సినిమా చూస్తున్న సమయంలో ఓ పాత్రను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. చిరు, నయన్ తండ్రి పాత్రలో ముఖ్యమంత్రిగా నటించిన వ్యక్తి ఒకప్పటి హీరో అని చాలా మందికి తెలిసి అవాక్కయ్యారు. ఇక ఈ తరం ప్రేక్షకులు మాత్రం ఆ నటుడిని గుర్తించలేకపోయారు. ఆయన మరెవరో కాదు.. సర్వదామన్ బెనర్జీ. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో సర్వదామన్.
1986లో దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాఎథ్ తెరకెక్కించిన సిరివెన్నెల. ఈ మూవీలో సుహాసిని, సర్వదామన్ బెనర్జీ ప్రధాన పాత్రలలో నటించారు. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాల్లో ఈ మూవీ ఒకటిగా నిలిచింది. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ శ్రోతలను ముగ్దులను చేస్తాయి.
ఈ సినిమాతోనే ప్రముఖ పాటల రచయిత సీతారామ శాస్త్రి. సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారారు. ఇందులో అంధుడిగా నటించి మెప్పించారు సర్వదామన్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి.. ఆకస్మాత్తుగా సినిమాలకు దూరమయ్యారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.