AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaaru Noukari: ‘సర్కారు నౌకరి’ టీజర్ రిలీజ్.. కొడుకు సినిమాపై సింగర్ సునీత ఎమోషనల్..

1996లో కొల్లాపూర్ వద్ద జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. సర్కారీ నౌకరి పీరియాడిక్ మూవీగా రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ లో హీరో గవర్నమెంట్ మెడికల్ ఎంప్లాయి. ఉద్యోగం వచ్చిన తర్వాత అతనికి పల్లెటూరు అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది.

Sarkaaru Noukari: 'సర్కారు నౌకరి' టీజర్ రిలీజ్.. కొడుకు సినిమాపై సింగర్ సునీత ఎమోషనల్..
Sarkaaru Noukari Movie Teas
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2023 | 1:12 PM

Share

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఉపద్రష్ట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ గుర్తింపు ఏర్పర్చుకున్నారు. ఇండస్ట్రీలో కొన్ని వందల పాటలతో సంగీత ప్రియలను మైమరపించింది. ఓవైపు పాటలు పాడుతునే.. మరోవైపు బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు సునీత. ఇక ఇప్పుడు ఆమె తనయుడు ఆకాష్ హీరోగా పరిచయం కాబోతున్నారు. ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సర్కారు నౌకరి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆర్కే టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు గంగానమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

1996లో కొల్లాపూర్ వద్ద జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. సర్కారీ నౌకరి పీరియాడిక్ మూవీగా రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ లో హీరో గవర్నమెంట్ మెడికల్ ఎంప్లాయి. ఉద్యోగం వచ్చిన తర్వాత అతనికి పల్లెటూరు అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత తన ఉద్యోగం వల్ల అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది సినిమా అని తెలుస్తోంది.

ఈ సినిమాలో ఆకాష్ జోడిగా.. భావన వళపండల్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో తనికెళ్ల భరణి, సాయి శ్రీనివాస్ కీలకపాత్రలలో నటించగా.. శాండిల్య సంగీతం అందించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వమే కాదు.. సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకలో సింగర్ సునీత మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “రాఘవేంద్రరావు గారి సినిమాల్లో ఎన్నో పాటలు పాడాను. డబ్బింగ్ చెప్పాను. ఇది మాకు హోమ్ బ్యానర్ లాంటింది. మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ.. రాఘవేంద్రరావు గారు సర్కారు నౌకరి సినిమా నిర్మించారు. మీ అబ్బాయి మంచి నటుడే కాదు.. సంస్కారం, మంచి నడవడిక ఉన్న వ్యక్తి. అతనికి ఫ్యూచర్, కెరీర్ బాగుంటాయని రాఘవేంద్రరావు గారు చెప్పినప్పుడు నా జీవితంలో అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే అనిపించింది. పిల్లలు ఎదిగితే వచ్చే సంతోషం ఇదే కావచ్చు” అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.