AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ileana: ఇలియానాకు ఇప్పటికే పెళ్లైపోయిందా ?.. సిక్రెట్‏గా మ్యారెజ్ చేసుకున్న గోవా బ్యూటీ.. ఆమె భర్త ఎవరంటే..

ఇలియానా తల్లి కాబోతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఎందుకంటే ఇలియానా అందరి దృష్టిలో ఇంకా పెళ్లి కాకుండానే ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. కానీ ఆకస్మాత్తుగా తల్లికాబోతున్నట్లుగా ప్రకటించడంతో అభిమానులు షాకయ్యారు. కానీ బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ.. తన లైఫ్ పార్టర్న్ ఫోటోస్ సైతం పంచుకుంది ఇలియానా. కానీ ఇప్పటికీ తన లైఫ్ మిస్టరీ మ్యాన్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Ileana: ఇలియానాకు ఇప్పటికే పెళ్లైపోయిందా ?.. సిక్రెట్‏గా మ్యారెజ్ చేసుకున్న గోవా బ్యూటీ.. ఆమె భర్త ఎవరంటే..
Ileana
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2023 | 12:50 PM

Share

టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా డిక్రూజ్ తల్లి అయిన సంగది తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంది. ఆగస్ట్ 1న తాను మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తాజాగా తన ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు తన కొడుకు పేరును కూడా వెల్లడిస్తూ..ఆ చిన్నారి ఫోటో సైతం షేర్ చేసింది. తన కొడుకు పేరు కావో ఫీనిక్స్ డోలన్ అని.. తన బిడ్డ రాకతో ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, నెటిజన్స్ ఇలియానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు ఇలియానాపై మరోసారి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. ఇప్పటికైనా తన భర్త ఎవరో చెప్పాలని. మిస్టరీ మ్యాన్ గురించి ఆరాలు తీస్తున్నారు. అయితో ఇలియానా తల్లి కాబోతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఎందుకంటే ఇలియానా అందరి దృష్టిలో ఇంకా పెళ్లి కాకుండానే ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. కానీ ఆకస్మాత్తుగా తల్లికాబోతున్నట్లుగా ప్రకటించడంతో అభిమానులు షాకయ్యారు. కానీ బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ.. తన లైఫ్ పార్టర్న్ ఫోటోస్ సైతం పంచుకుంది ఇలియానా. కానీ ఇప్పటికీ తన లైఫ్ మిస్టరీ మ్యాన్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా ఈ గోవా బ్యూటీకి పెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

DNA నివేదిక ప్రకారం, ఇలియానా, మైఖేల్ ఇద్దరూ వివాహం చేసుకున్నారట. ఈ గోవా బ్యూటీకి ఇదివరకే పెళ్లి అయిపోయిందని.. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదట. ఈ జంట వివాహ రిజిస్ట్రేషన్లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుందట. వివరాల ప్రకారం ఈ ఏడాది మే 13న ఇలియానా, మైఖేల్ పెళ్లి చేసుకున్నారని టాక్.. అంటే ఈ జంట వారి గర్భధారణను ప్రకటించడానికి నాలుగు వారాల ముందు వివాహం చేసుకున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో స్పష్టంగా తెలియరాలేదు. పెళ్లి సమయంలో ఇలియానా తెల్లటి దుస్తులు ధరించిందని సమాచారం.

ఇవి కూడా చదవండి

తన కొడుకు ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని.. తమ హృదయాలు ఆనందంతో నిండిపోయాయంటూ ట్వీట్ చేసింది. తాను ఎంతో క్లిష్ట పరిస్థితులలో ఉన్న సమయంలో మైఖేల్ తన చేతిని పట్టుకున్నాడని.. నిత్యం తనకు అండగా ఉండి తన కన్నీళ్లను తుడిచాడని.. నవ్వించడానికి గూఫీ జోక్స్ వేసేవాడని… అతను తన పక్కన ఉన్నప్పుడు ప్రతదీ అంత కష్టంగా అనిపించదంటూ గతంలో ఓ పోస్ట్ చేసింది ఇలియానా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.