ఎంత మంచివాడవయ్యా..! దివ్యంగులతో పాటు కలిసి పాట పాడిన శ్రీ కృష్ణ..
తమ పాటలు విని ఎవరైనా ఆర్థిక సాయం చేస్తారని ఎదుచూస్తూ ఉంటారు. కళ్లు కనిపించాపోయినా సింగింగ్ లో తమ ప్రతిభను కనబరుస్తూ రోడ్ల పై ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్లను చూసి కొంతమంది అయ్యో పాపం అని జాలితో తమకు తోచినంత ఇస్తే మరికొంతమంది మాత్రం చూసి పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు.

మహానగరాల్లో మనకు ఎక్కువగా తారసపడే వాటిలో ఇది ఒకటి. దివ్యంగులు రోడ్డు పక్కన పాటలు ఆలపిస్తూ కనిపిస్తుంటారు. మైక్ లు, స్పీకర్లు పెట్టుకొని సినిమా పాటలు ఆలపిస్తూ ఉంటారు. తమ పాటలు విని ఎవరైనా ఆర్థిక సాయం చేస్తారని ఎదుచూస్తూ ఉంటారు. కళ్లు కనిపించాపోయినా సింగింగ్ లో తమ ప్రతిభను కనబరుస్తూ రోడ్ల పై ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్లను చూసి కొంతమంది అయ్యో పాపం అని జాలితో తమకు తోచినంత ఇస్తే మరికొంతమంది మాత్రం చూసి పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు. అయితే తాజాగా సింగర్ శ్రీ కృష్ణ చేసిన పని అందరి చేస్తా అతన్ని శబాష్ అని ప్రశంసించేలా చేసింది.
సింగర్ శ్రీకృష్ణ తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితుడు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు శ్రీకృష్ణ. చాలా సినిమాల్లో హిట్ సాంగ్స్ అలరించారు శ్రీకృష్ణ. అలాగే పలు సింగింగ్ షోల్లోనూ పాల్గొన్నారు శ్రీకృష్ణ. టాలీవుడ్ లో ప్లే బ్యాక్ సింగర్ గా రాణిస్తున్న శ్రీకృష్ణ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆయన ఓ వీడియో షేర్ చేశారు.
శ్రీకృష్ణ రోడ్డు పైన పాటలు పాడుతున్న దివ్యంగులను చూసి చెలించిపోయారు. అక్కడ పాట పడుతున్న వ్యక్తితో కలిసి శ్రీ కృష్ణ కూడా పాట పాడారు. ఆరాధనా మూవీలోని ప్రేమ ఎంత మధురం అనే పాటను అలరించారు శ్రీకృష్ణ. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆ దివ్యంగులకు సాయం చేయాలని కోరారు. వారి ఫొటోలతోపాటు.. సాయం చేసేవారికోసం క్యూ ఆర్ స్క్యాన్ ఫోటో కూడా షేర్ చేశారు శ్రీ కృష్ణ. ఈ పోస్ట్ పై నెటిజన్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అన్న నువ్వు గ్రేట్ అని కొందరంటుంటే.. ఒక కళాకారుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం నీలో చూశాను శ్రీకృష్ణ బ్రదర్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీకృష్ణ ఇన్ స్టా గ్రామ్ వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.