2024 Movies: ఈ ఏడాది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది..? 2024లో రాబోయే భారీ సినిమాలేంటి..?
సాధారణంగా ప్రతీ ఏటా తొలి ఆర్నెళ్లు ముగిసాక ఇండస్ట్రీ రివ్యూ ఉంటుంది.. కానీ ఈ సారి అంత సినిమా లేదు. ఎందుకంటే సంక్రాంతి తర్వాత సినిమాలే లేవు కాబట్టి. మరి 2024 ఫ్యూచర్ డిసైడ్ అయ్యేదెప్పుడు..? అసలు ఈ ఏడాది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది..? 2024లో రాబోయే భారీ సినిమాలేంటి..? ఓ వైపు ఎన్నికలు, మరోవైపు IPL.. ఇవన్నీ టాలీవుడ్ తొలి ఆర్నెళ్లను పూర్తిగా మింగేసేలా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే సెకండాఫ్‌పైనే భారం అంతా పడనుంది. ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు పుష్ప 2, దేవర, ఓజి, గేమ్‌ఛేంజర్ ఇలా చాలా సినిమాలు రానున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




