- Telugu News Photo Gallery Cinema photos Due to the election, the buzz of movies will decrease in summer
Summer Movies: సమ్మర్ అంతా ఎన్నికలకే పరిమితమా.? సినిమాల సంగతేంటి.?
ప్రతీసారి సమ్మర్ మీద ఆశ ఎక్కువగా ఉండేది. సంక్రాంతి తర్వాత పరిస్థితి కాస్త గందరగోళంగా ఉన్నా కూడా సమ్మర్ సీజన్ ఉందిగా అప్పుడు చూసుకుందాం అనుకునేవాళ్లు నిర్మాతలు. కానీ ఈసారి అది కూడా లేదు. 2024 సమ్మర్ అంతా ఎన్నికలకే సమర్పయామి అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రీ బయటపడేదెలా..? అసలెన్ని సినిమాలు ఈ వేసవిలో రాబోతున్నాయి..?
Updated on: Mar 20, 2024 | 9:08 AM

ఎప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ వస్తున్నాడు.. విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే రౌడీ బాయ్ ఒక్కడి వల్లే సమ్మర్ జాతకం మారదు. ఈ గ్యాప్‌లో వచ్చే ఫ్యామిలీ స్టార్ కంటితుడుపు మాత్రమే.

ఐపిఎల్, ఎన్నికలే సమ్మర్‌ను తినేస్తున్నాయి. మార్చిలోనే ఎన్నికల వేడి పీక్స్‌లో ఉంది.. ఇక ఎప్రిల్‌కు ఆ సెగ మరింత పెరగనుంది.. ఇప్పుడు షెడ్యూల్ మే 13 అని తేలడంతో జూన్ వరకు అంతా రాజకీయమే కనబడనుంది.

అలాగే మే 9న విడుదల కావాల్సిన ప్రభాస్ కల్కి కూడా ఎన్నికల కారణంగా వాయిదా పడేలా కనిపిస్తుంది. ఈ చిత్రం ఆగష్టు 15కి పోస్టుపోన్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ డేట్ ను ఆల్రెడీ పుష్ప బుక్ చేసుకుంది. మరి చుడాలిక ఏమి జరగనుందో.

Kalki 2898 Ad And Elections

కనుచూపు మేరలో పెద్ద సినిమాలేవీ కనిపించడం లేదు. టార్చ్ వేసి వెతికినా మార్చిలో స్టార్స్ లేరు.. అలాగే ఎప్రిల్‌లోనూ అదే పరిస్థితి. మార్చి 29న రాబోయే టిల్లు స్క్వేర్ కొద్దో గొప్ప యూత్‌ను థియేటర్స్ వరకు రప్పిస్తుంది. కానీ అప్పుడు ఎగ్జామ్స్ టైమ్.. దాంతో అప్పుడు కూడా కష్టాలే వెంటాడుతున్నాయి నిర్మాతలను.

ఎన్నికలు మే 13 కాబట్టి దాని ముందు టైమ్ విజయ్ సినిమాకు హెల్ప్ కానుంది. ఫ్యామిలీ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయకిగా నటిస్తుంది. దీనికి దిల్ రాజు నిర్మాత. సినిమా ఏ మాత్రం బాగున్నా.. 100 కోట్లు పెద్ద మ్యాటర్ కాదు.




