AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AR Rahman: ఏఆర్. రెహమాన్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా.? డిప్రెషన్‌ గురించి ఏమన్నారంటే..

ప్రస్తుతం ఎంతోమంది ఎదుర్కొంటున్న డిప్రెషన్‌ సమస్య గురించి ఆయన ఈ వేదికపై మాట్లాడారు. శారీరక అవసరాలపై శ్రద్ధ చూపడం మానేయాలని రెహమాన్ సలహా ఇచ్చారు. ‘ఈరోజుల్లో చాలామంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు.

AR Rahman: ఏఆర్. రెహమాన్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా.? డిప్రెషన్‌ గురించి ఏమన్నారంటే..
A.r. Rahman
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2024 | 12:53 PM

Share

గోవా వేదికగా 55వ ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌ ముగింపు వేడుకలో ఏఆర్‌ రెహమాన్‌ పాల్గొన్నారు. విడాకుల ప్రకటన తర్వాత రెహమాన్‌ తొలిసారి బహిరంగంగా కనిపించారు. ప్రస్తుతం ఎంతోమంది ఎదుర్కొంటున్న డిప్రెషన్‌ సమస్య గురించి ఆయన ఈ వేదికపై మాట్లాడారు. శారీరక అవసరాలపై శ్రద్ధ చూపడం మానేయాలని రెహమాన్ సలహా ఇచ్చారు. ‘ఈరోజుల్లో చాలామంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఎందుకంటే వారు జీవితంలో ఏదో ముఖ్యమైన దాన్ని కోల్పోయామనే భావనలో ఉంటున్నారు. జీవితమంతా శూన్యంగా మారిందనే భ్రమలో జీవిస్తున్నారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియడం లేదు. చదవడం, రాయడం లేదా మనకు ఇష్టమైన సంగీతం వినడంలాంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది’ అని తెలిపారు.

ఇది కూడా చదవండి : వీడియో లీక్ అయ్యింది.. కెరీర్ క్లోజ్ అయ్యింది.. చివరకు ఇలా..

తన యవ్వనంలో వచ్చిన ఆత్మహత్య ఆలోచనల గురించి రెహమాన్‌ ఇఫీ వేదికపై పంచుకున్నారు. ఆ సమయంలో తన తల్లి ఇచ్చిన సలహా జీవితాన్ని మార్చేసిందన్నారు. ‘మనం ఇతరుల కోసం జీవించినప్పుడు ఆత్మహత్య ఆలోచనలు రావు’ అని తన తల్లి సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. అప్పటినుంచి తన ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందన్నారు. జీవితంలో అందుకున్న అత్యంత అందమైన, గొప్ప సలహా ఇదేనన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అబ్బాయ్ సుందరం.. కంచరపాలెం చిన్నది ఇప్పుడు ఎంత అందంగా ఉందో

ఈ మాటలు తన జీవితానికి లోతైన అర్థాన్ని ఇచ్చాయని.. మానసిక ఆరోగ్య సవాళ్లను అధిగమించడంలో సహాయపడ్డాయని రెహమాన్‌ వివరించారు. ఇక రెహమాన్‌ దంపతులు విడాకుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. విడిపోవాలనే నిర్ణయం పరస్పర అంగీకారంతోనే తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఒకరంటే ఒకరికి గౌరవం ఉందన్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకుంది కట్ చేస్తే 6 నెలలకే విడాకులు ఇచ్చింది.. ఇప్పుడు అందాలతో అదరగొడుతోంది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..