Andrea Jeremiah: అందుకే పెళ్లి ఎప్పటికీ చేసుకోను.. హీరోయిన్ ఆండ్రియా షాకింగ్ కామెంట్స్..
బాలీవుడ్ భామలు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుండగా..సౌత్ బ్యూటీస్ మాత్రం సింగిల్ లైఫ్ ఈజ్ బెస్ట్ అంటున్నారు. ఇప్పుడు నాలుగు పదుల వయసులో సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది త్రిష. పొన్నియన్ సెల్వన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ పెళ్లి గురించి అసలు ఆలోచించడం లేదు. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది అనుష్క. ఇక పెళ్లి అసలే చేసుకోనంటుంది హీరోయిన్ ఆండ్రియా జెర్మియా.

ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒక వయసు వచ్చాక పెళ్లి కచ్చితంగా చేసుకోవాలనే మాటను పక్కన పెట్టేస్తున్నారు. సింగిల్‌గా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో సెలబ్రెటీలు ముందుంటున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోని కొందరు హీరోయిన్స్ పెళ్లి అనే మాటకు దూరంగా ఉండడమే బెటర్ అంటున్నారు. ఓవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ల సీజన్ నడుస్తుంది. బాలీవుడ్ భామలు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుండగా..సౌత్ బ్యూటీస్ మాత్రం సింగిల్ లైఫ్ ఈజ్ బెస్ట్ అంటున్నారు. ఇప్పుడు నాలుగు పదుల వయసులో సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది త్రిష. పొన్నియన్ సెల్వన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ పెళ్లి గురించి అసలు ఆలోచించడం లేదు. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది అనుష్క. ఇక పెళ్లి అసలే చేసుకోనంటుంది హీరోయిన్ ఆండ్రియా జెర్మియా. ఇంతకీ ఈ బ్యూటీ చెప్తున్న కారణమేంటో తెలుసా ?..
ఆండ్రియా జెర్మియా తెలుగు, తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. అయితే ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. ఇటీవల వెంకటేశ్ నటించిన సైంధవ్ మూవీలో కీలకపాత్ర పోషించింది. తాజాగా ఈ బ్యూటీ తన పెళ్లి గురించి మాట్లాడింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలని లేదని తెలిపింది. “20-25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో కుదరలేదు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సంతోషిస్తానని కాదు, పెళ్లి కాకపోయినా చాలా సంతోషంగా ఉంటాను.. ” అని చెప్పుకొచ్చింది.
అయితే పెళ్లయినవాళ్లు ఎంత మంది సంతోషంగా ఉన్నారు? అంటూ తిరిగి ప్రశ్నించింది. పెళ్లైన వాళ్ల గురించి మాట్లాడేందుకు తాను రెడీగా లేనని.. తాను ఈ జీవితానికి అలవాటు పడ్డానని.. ఇప్పుడు లేదా భవిష్యత్తులో వివాహం గురించి ఆలోచించనలు లేవని.. ఎప్పటికీ పెళ్లి చేసుకోనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం డెవిల్2 చిత్రంలో నటించింది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




