Chinna Trailer: తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది.. తెలుగులోకి సిద్ధార్థ్ ‘చిన్నా’ మూవీ.. ట్రైలర్ రిలీజ్..

అప్పట్లో ఈ హీరోకు బోలెడంత అమ్మాయిల ఫాలోయింగ్ ఉండేది. తెలుగు సినీ పరిశ్రమలో లవర్ బాయ్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్ధార్థ్ కెరియర్ ఆకస్మాత్తుగా మారిపోయింది. ఆ తర్వాత ఆయన ఎంచుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తా పడ్డాయి. దీంతో తెలుగులో సిద్ధుకు అవకాశాలు తగ్గిపోయాయి. సౌత్ ఇండస్ట్రీలో సిద్ధార్థ్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. దీంతో పలు చిత్రాల్లో సహయ నటుడిగా కనిపించారు. ఇక ఇప్పుడిప్పుడే సిద్ధార్థ్ తన కెరీర్ పై ఫోకస్ పెట్టారు.

Chinna Trailer: తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది.. తెలుగులోకి సిద్ధార్థ్ 'చిన్నా' మూవీ.. ట్రైలర్ రిలీజ్..
Chinna Trailer
Follow us

|

Updated on: Oct 01, 2023 | 9:16 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు సిద్ధార్థ్. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. అప్పట్లో ఈ హీరోకు బోలెడంత అమ్మాయిల ఫాలోయింగ్ ఉండేది. తెలుగు సినీ పరిశ్రమలో లవర్ బాయ్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న సిద్ధార్థ్ కెరియర్ ఆకస్మాత్తుగా మారిపోయింది. ఆ తర్వాత ఆయన ఎంచుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తా పడ్డాయి. దీంతో తెలుగులో సిద్ధుకు అవకాశాలు తగ్గిపోయాయి. సౌత్ ఇండస్ట్రీలో సిద్ధార్థ్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. దీంతో పలు చిత్రాల్లో సహయ నటుడిగా కనిపించారు. ఇక ఇప్పుడిప్పుడే సిద్ధార్థ్ తన కెరీర్ పై ఫోకస్ పెట్టారు. హిట్టు, ప్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు చేసేందుకు రెడీ అయ్యారు.

ఇటీవలే తమిళంలో చిత్త సినిమా చేశారు సిద్ధార్థ్. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తన కెరీర్ లో సిద్ధార్థ్ కొత్తగా ట్రై చేసిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స బాగున్నాయని.. ప్రతి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా ఇదని విమర్శకులు కొనియాడారు. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడడు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అయితే తెలుగులో చిత్త పేరును చిన్నగా మార్చి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో అక్టోబర్6న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా శనివారం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు చేయని డీగ్లామర్ రోల్ చేశారు సిద్ధార్థ్. ఇందులో మలయాళీ బ్యూటీ నిమిషా సజయన్ కథానాయికగా నటించగా.. బాలనటిగా సహస్ర నటించింది.

తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. చిన్నాన్న, కూతురు మధ్య జరిగే భావోద్వేగ కథే ఈ మూవీ. స్కూలుకు వెళ్లే బాలికకు చిన్నాన్నగా సిద్ధార్థ్ అద్భుతమైన నటన కనబరిచారు. రోజూ స్కూల్ వెళ్లే ఆ బాలిక తప్పిపోవడంతో చిన్నాన్న పడే బాధ.. ఆవేదనను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారట..ఈ సినిమాలో చిన్నారి సహస్ర పాత్ర ఎంతో కీలకమట. ఈ సినిమాను సిద్ధార్థ్ సమర్పణలో ఎటాకి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ఇక తెలుగులోకి ఏషియన్ సినిమాస్ తీసుకువస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.