Kushi Movie: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఖుషి’ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో సామ్, విజయ్ కెమిస్ట్రీ చూడముచ్చటగా నిలిచింది. అలాగే చాలా కాలం తర్వాత వీరిద్దరి ఖాతాల్లో డీసెంట్ హిట్ కంబ్యాక్ లా నిలిచింది. అయితే థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

లైగర్ డిజాస్టర్ తర్వాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఖాతాలో సూపర్ హిట్ పడింది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ నటించిన ఖుషి చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో సమంత కథానాయికగా నటించింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో సామ్, విజయ్ కెమిస్ట్రీ చూడముచ్చటగా నిలిచింది. అలాగే చాలా కాలం తర్వాత వీరిద్దరి ఖాతాల్లో డీసెంట్ హిట్ కంబ్యాక్ లా నిలిచింది. అయితే థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేనీ, రవిశంకర్ కలిసి నిర్మించగా.. ఇందులో సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, జయరాం, రోహిణి, వెన్నెల కిషోర్ కీలకపాత్రలలో నటించారు.
Now beaming because we’re seeing them in a day 🥹 pic.twitter.com/jobx2fEBEZ
— Netflix India (@NetflixIndia) September 30, 2023
కథ విషయానికి వస్తే..
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అయిన విప్లవ్ (విజయ్ దేవరకొండ).. కశ్మీర్ లో ఆరాధ్య (సమంత)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఆమె కూడా విజయ్ ను ప్రేమిస్తుంది. అయితే వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు. దీంతో విప్లవ్, ఆరాధ్య బయటకు వెళ్లి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత కొద్దిరోజులు సంతోషంగా ఉన్న వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ గొడవలు పెద్దవిగా మారి విడిపోతారు. దీంతో మానసిక సంఘర్షణకు గురవుతారు. అయితే విప్లవ్, ఆరాధ్య మధ్య ఎలాంటి పరిణామాలు జరిగాయి.. చివరకు ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారు అనేది ఖుషి సినిమా.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







