Shruti Haasan: సీక్రెట్ బయటపెట్టేస్తానంటోన్న శ్రుతిహాసన్.. ఇక దాచడం తనవల్ల కాదట.. పోస్ట్ వైరల్..
ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ సైతం కంప్లీట్ చేసుకుంది. అలాగే అటు హాలీవుడ్ లోనూ 'ది ఐ' అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. అలాగే సోషల్ మీడియాలో శ్రుతిహాసన్ చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఇక తన ప్రియుడు శంతనుతో కలిసి డ్యాన్సులు చేస్తూ.. జిమ్ వర్కవుట్స్ చేస్తూ ఉంటుంది. చాలాకాలంగా శంతను హజారికతో ఈ బ్యూటీ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

శ్రుతిహాసన్.. మల్టీటాలెంటెడ్ హీరోయిన్. నటనతో అలరిస్తూనే.. మరోవైపు సింగర్‌గా రాణిస్తోంది. తెలుగు, హిందీ, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం శ్రుతి హాసన్ సలార్ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ సైతం కంప్లీట్ చేసుకుంది. అలాగే అటు హాలీవుడ్ లోనూ ‘ది ఐ’ అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. అలాగే సోషల్ మీడియాలో శ్రుతిహాసన్ చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఇక తన ప్రియుడు శంతనుతో కలిసి డ్యాన్సులు చేస్తూ.. జిమ్ వర్కవుట్స్ చేస్తూ ఉంటుంది. చాలాకాలంగా శంతను హజారికతో ఈ బ్యూటీ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ వీరి పెళ్లి గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇదిలా ఉంటే నిత్యం నెట్టింట యాక్టివ్ గా ఉండే శ్రుతి తాజాగా ఆసక్తికర పోస్ట్ చేసింది. తన దగ్గర ఓ సీక్రెట్ ఉందని.. ఇక ఆ విషయాన్ని దాచడం తనవల్ల కాదని.. బయటపెట్టేస్తానంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ స్టోరీ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఈ సీక్రెట్ వ్యక్తిగతమైనదా ? లేదా ఏదైనా సినిమాకు సంబంధించినదా ? అన్నది మాత్రం తెలియరాలేదు. మొత్తానికి శ్రుతి మాత్రం ఏదో గుడ్ న్యూస్ పంచుకోబోతుందని తెలుస్తోంది.

Shruti Haasan
View this post on Instagram
ప్రస్తుతం శ్రుతి హాసన్ సలార్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆద్య పాత్రలో కనిపించనుంది. గతంలో విడుదలైన శ్రుతిహాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది శ్రుతి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.