Sharwanand: ఇవాళే శర్వానంద్- రక్షితల పెళ్లి దావత్.. సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన ట్యాలెంటెడ్ హీరో
ఈరోజు (జూన్ 9) శర్వానంద్ పెళ్లి రిసెప్షన్ జరగనుంది. హైదరాబాద్‍లోని ఎన్ కన్వెన్షన్‍లో శర్వానంద్, రక్షితా రెడ్డి వివాహ రిసెప్షన్ సాయంత్రం 7.30 గంటల నుంచి గ్రాండ్‌గా ఈ ఫంక్షన్ జరగనుంది. ఈ వేడుక కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శర్వానంద్ ఆహ్వానించాడు.

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‍లో వేదికగా రక్షితా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు శర్వా. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్, హీరో సిద్ధార్థ్, నటి అతిథిరావ్ హైదరీ, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రముఖ నిర్మాత దిల్‍రాజు కుటుంబ సభ్యులు కూడా ఈ వివాహానికి వెళ్లారు. కాగా ఈరోజు (జూన్ 9) శర్వానంద్ పెళ్లి రిసెప్షన్ జరగనుంది. హైదరాబాద్‍లోని ఎన్ కన్వెన్షన్‍లో శర్వానంద్, రక్షితా రెడ్డి వివాహ రిసెప్షన్ సాయంత్రం 7.30 గంటల నుంచి గ్రాండ్‌గా ఈ ఫంక్షన్ జరగనుంది. ఈ వేడుక కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శర్వానంద్ ఆహ్వానించాడు. గురువారం కేసీఆర్‌ను స్వయంగా కలిసి రిసెప్షన్ ఇన్విటేషన్ అందించాడు శర్వానంద్. ఈ రిసెప్షన్‍కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కాగా శర్వానంద్, రక్షితా రెడ్డి వివాహ వేడుకలు లీలా ప్యాలెస్‌లో రెండు రోజుల పాటు ఘనంగా జరిగాయి. జూన్ 2న హల్దీ, సంగీత్ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ తర్వాత జూన్ 3వ తేదీ రాత్రి శర్వా – రక్షిత విహహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే, శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే పెళ్లి కోసం కొన్ని రోజుల నుంచి షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు శర్వా.




Hero #Sharwanand met Hon’ble Chief Minister of Telangana Shri. #KCR Garu and invited him for the wedding reception to be held grandly on June 9th in Hyderabad. @ImSharwanand pic.twitter.com/2s0wIJ5B0g
— Suresh PRO (@SureshPRO_) June 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..