Urvashi: సీనియర్ నటి ఊర్వశి పిల్లలను ఎప్పుడైనా చూశారా ?.. కూతురు హీరోయిన్స్ కంటే అందంగా ఉంది..
శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో పద్మమ్మ పాత్రలో అలరించింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పాత్రలకు ఆమె నటనతో ప్రాణం పోసింది. తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. ఇప్పుడు సహాయనటిగా రాణిస్తోంది. ఇటీవలే ఊర్వశి సోషల్ మీడియాలో ఇన్ స్టా ఖాతా ఓపెన్ చేసింది.

సీనియర్ నటి ఊర్వశి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు.. కానీ ఆమె తెరపై కనిపిస్తే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. టాలీవుడ్ సినిమాల్లో తల్లిగా, పిన్నిగా ఎన్నో పాత్రలు పోషించి ఆడియన్స్ కు దగ్గరయ్యారు. చక్రం సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించి మెప్పించారు. అలాగే సమంత నటించిన బేబీ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మరదలిగా కనిపించి నవ్వించింది. ఇక శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో పద్మమ్మ పాత్రలో అలరించింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పాత్రలకు ఆమె నటనతో ప్రాణం పోసింది. తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. ఇప్పుడు సహాయనటిగా రాణిస్తోంది. ఇటీవలే ఊర్వశి సోషల్ మీడియాలో ఇన్ స్టా ఖాతా ఓపెన్ చేసింది.
ఊర్వశి శివప్రసాద్ పేరుతో మొదలైన ఈ ఖాతా కొద్ది రోజుల్లోనే 70వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు నటి ఊర్వశి. కూతురు కుంజత (తేజ లక్ష్మి), కుమారుడు ఇషాన్ ప్రజాపతితో కలిసి ఉన్న ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.




అయితే ముఖ్యంగా ఊర్వశి కూతురు తేజ లక్ష్మి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. తను చాలా ముద్దుగా ఎంతో అందంగా కనిపిస్తుంది. హీరోయిన్స్ కంటే అందంగా ఉందని… త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఊర్వశి.. నటుడు మనోజ్ కె.జయన్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు కుంజత జన్మించింది. అయితే మనస్పర్థల కారణంగా వీరిద్దరు 2008లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2013లో ఊర్వశి..చెన్నైలోని బిల్డర్ శివప్రసాద్ ను పెళ్లి చేసుకోగా..వీరికి కుమారుడు ఇషాన్ జన్మించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




