Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Lakshmi: సీనియర్ నటిపై మాజీ భర్త షాకింగ్ కామెంట్స్.. రూమ్‏కు రమ్మని పిలిచి..

తాజాగా ఆమె మాజీ భర్త మోహన్ శర్మ లక్ష్మి పై సంచలన కామెంట్స్ చేశారు. లక్ష్మీ, మోహన్ శర్మ చాలా సినిమాల్లో కలిసి నటించారు. 1975లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వారి మధ్య మనస్పర్థలు రావడంతో 1980లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్మి డైరెక్టర్ శివచంద్రన్ ను రెండో పెళ్లి చేసుకుంది. ఇన్నాళ్లు సైలెంట్‏గా ఉన్న ఆమె మాజీ భర్త మోహన్ శర్మ ఇప్పుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. లక్ష్మితో ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.

Actress Lakshmi: సీనియర్ నటిపై మాజీ భర్త షాకింగ్ కామెంట్స్.. రూమ్‏కు రమ్మని పిలిచి..
Lakshmi
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 14, 2024 | 7:16 AM

తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి లక్ష్మి సుపరిచితమే. ఒకప్పుడు కథానాయికగా అనేక చిత్రాల్లో కనిపించిన ఆమె.. ఆ తర్వాత సహాయ నటిగా నటించింది. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి సినిమా నుంచి సమంత కనిపించిన బేబి సినిమా వరకు నటనతో అలరించారు. అయితే సినిమాల గురించి కాకుండా ఆమె వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంటారు. తాజాగా ఆమె మాజీ భర్త మోహన్ శర్మ లక్ష్మి పై సంచలన కామెంట్స్ చేశారు. లక్ష్మీ, మోహన్ శర్మ చాలా సినిమాల్లో కలిసి నటించారు. 1975లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వారి మధ్య మనస్పర్థలు రావడంతో 1980లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్మి డైరెక్టర్ శివచంద్రన్ ను రెండో పెళ్లి చేసుకుంది. ఇన్నాళ్లు సైలెంట్‏గా ఉన్న ఆమె మాజీ భర్త మోహన్ శర్మ ఇప్పుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. లక్ష్మితో ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.

‘నేను, లక్ష్మి కలిసి చాలా సినిమాల్లో నటించాం. కానీ. లక్ష్మి నన్ను ఇష్టపడుతుందని నాకు తెలియదు. ఒకరోజు నాతో షాపింగ్‌కి వస్తావా అని నటుడు మోహన్‌ని లక్ష్మి అడిగింది. వాళ్లు చెప్పిన ప్రతిచోటా తీసుకెళ్లి షాపింగ్ చేశాను. అప్పుడు ఒక పర్ఫ్యూమ్ బాటిల్ కొనాలనుకున్నాను. కానీ దాని ధర రూ.500. అప్పట్లో నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ ఆ తర్వాత అదే బాటిల్ నాకు బహుమతిగా ఇచ్చింది లక్ష్మి. అప్పుడే నాకు ప్రపోజ్ చేసింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మీ జీవితంలో నాకు అవకాశం ఇస్తే నేను మీ కుక్కలా ఉంటాను అని చెప్పింది. దీంతో ఆమె మాటలు విని షాకయ్యాను. మొదటిసారి ఓ అమ్మాయి నాకు ప్రేమను తెలపడం. అయితే లక్ష్మి మాటలను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. ఆ రాత్రి నాకు నిజంగా నిద్ర పట్టలేదు. లక్ష్మి మరుసటి రోజు ఫోన్ చేసి రూమ్ కి రండి అని పిలిచింది. నేను నేరుగా హోటల్ గదికి వెళ్ళాను. ఇద్దరం పెళ్లి చేసుకుందామా? అడిగింది లక్ష్మి. ప్రస్తుతం నేను నా కెరీర్‌పై దృష్టి పెట్టాలి. పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పాను.

నేను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను. అందుకే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. వెంటనే ఆమె నుదుటిపై కుంకుమ రాశాను.. ఆ రాత్రి మేమిద్దరం భార్యాభర్తలమయ్యాం. చెన్నైకి వచ్చి లాయర్ ద్వారా మా పెళ్లి గురించి మీడియాకు తెలియజేశాం’ అంటూ చెప్పుకొచ్చారు. లక్ష్మి ఎన్నో తప్పులు చేసిందని.. తన తల్లి గురించి ఆమె కూతురు ఐశ్వర్య అన్ని విషయాలు తనతో చెప్పిందని.. దీంతో తల్లికూతురి మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయని అన్నారు. కూతురితో అలా ప్రవర్తిస్తావా అని వారించినందుకు తనతో ఇష్టానుసారంగా మాట్లాడిందని.. ఆ తర్వాత ఆమె ప్రవర్తన నచ్చక విడాకులు తీసుకున్నాని అన్నారు. ప్రస్తుతం మోహన్ శర్మ చేసిన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నేడే ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ 2025 ఫలితాలు..
నేడే ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ 2025 ఫలితాలు..
కోహ్లీ ఫేవరేట్‌కు ఊహించని షాక్.. బీసీసీఐ దెబ్బకు రిటైర్మెంట్‌?
కోహ్లీ ఫేవరేట్‌కు ఊహించని షాక్.. బీసీసీఐ దెబ్బకు రిటైర్మెంట్‌?
పీతల వేపుడిని ఇలా చేసుకోండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..
పీతల వేపుడిని ఇలా చేసుకోండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..
ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో..
ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో..
విమానాశ్రయంలో గిల్ క్యూట్ మూమెంట్.. ఫ్యాన్స్ ఫిదా!
విమానాశ్రయంలో గిల్ క్యూట్ మూమెంట్.. ఫ్యాన్స్ ఫిదా!
టెన్త్ విద్యార్ధులకు 2025 అలర్ట్.. రేపే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు!
టెన్త్ విద్యార్ధులకు 2025 అలర్ట్.. రేపే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు!
అతను చేసిన పనికి 6నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు..
అతను చేసిన పనికి 6నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు..
ఫ్యాటీ లివర్ ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఎంత ప్రమాదకరమో తెలుసా
ఫ్యాటీ లివర్ ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఎంత ప్రమాదకరమో తెలుసా
'ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం'.. RSS చీఫ్ సామాజిక ఐక్యతామంత్రం
'ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం'.. RSS చీఫ్ సామాజిక ఐక్యతామంత్రం
వేసవిలో సూర్య నమస్కారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా
వేసవిలో సూర్య నమస్కారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా