AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: చరిత్ర సృష్టించబోతున్న ఆదిపురుష్.. ” రామ్ సియా రామ్ ” పాట కోసం భారీ ప్లాన్..

బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్‌. ఈ మూవీ టీమ్ మరోసారి చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటికే సెట్ అయిన బెంచ్ మార్క్ ను మరోమెట్టు పైకి తీసుకువెళ్లేలా.. మూవీ టీమ్ రెండో పాటను విడుదల చేయబోతోంది.

Adipurush: చరిత్ర సృష్టించబోతున్న ఆదిపురుష్..  రామ్ సియా రామ్  పాట కోసం భారీ ప్లాన్..
Adipurush
Rajitha Chanti
|

Updated on: May 25, 2023 | 11:16 AM

Share

బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్‌. ఈ మూవీ టీమ్ మరోసారి చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటికే సెట్ అయిన బెంచ్ మార్క్ ను మరోమెట్టు పైకి తీసుకువెళ్లేలా.. మూవీ టీమ్ రెండో పాటను విడుదల చేయబోతోంది. ఈ తరహాలో ఇప్పటి వరకూ ఇండియాలో ఏ సినిమా పాట విడుదల కాలేదు. “రామ్ సియా రామ్” అంటూ సాగే ఈ గీతాన్ని ఈ నెల 29న హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ గీతాన్ని సంగీత ద్వయం సచేత్ – పరంపర స్వరపరచడంతో పాటు వారే పాడారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఒక సెన్సేషనల్ గా ఉండబోతోన్న ఈ పాట ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మూవీ ఛానెల్స్, మ్యూజిక్ ఛానెల్స్ తో పాటు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ మీడియా, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, టికెటింగ్ పార్టనర్స్, సినిమా థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలపై మే 29 మధ్యాహ్నం 12గంటలకు ఈ పాటను ఒకే సమయంలో ఒకేసారి వినిపించబోతున్నారు. సినిమాలకు సంబంధించి దేశ చరిత్రలోనే ఇదో సంచలనం కాబోతోంది. ఇందులో ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ ఆదిపురుష్‌ మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేయగా.. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ జైశ్రీరామ్ పాట ఆకట్టుకుంది. ఇందులో ప్రభాస్ రాముడిగా.. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.