AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sardar Movie Telugu Review: నీళ్ల గురించి ఆలోచింపజేసే స్పై మూవీ ‘సర్దార్‌’

సర్దార్‌ ఇవాళ రిలీజ్‌ అయింది. రెండూ స్పై సినిమాలే. ఒన్స్ ఎ స్పై.. ఆల్వేస్‌ ఎ స్పై అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా సర్దార్‌. ఆద్యంతం ఎలా ఉంది? ఇందులో ఏజెంట్‌ సర్దార్‌ కంప్లీట్‌ చేసిన మిషన్‌ ఏంటి?

Sardar Movie Telugu Review: నీళ్ల గురించి ఆలోచింపజేసే స్పై మూవీ 'సర్దార్‌'
Sardar
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Rajitha Chanti|

Updated on: Oct 21, 2022 | 4:02 PM

Share

ఈ మధ్య నెట్టింట్లో ఒకటే చర్చ. కార్తి చేస్తున్న సర్దార్‌ సినిమాకీ, షారుఖ్‌ ఖాన్‌ చేస్తున్న జవాన్‌ సినిమాకీ పోలిక ఉందా? లేదా? అని. జవాన్‌ సినిమా ఇప్పుడు మేకింగ్‌లో ఉంది. సర్దార్‌ ఇవాళ రిలీజ్‌ అయింది. రెండూ స్పై సినిమాలే. ఒన్స్ ఎ స్పై.. ఆల్వేస్‌ ఎ స్పై అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా సర్దార్‌. ఆద్యంతం ఎలా ఉంది? ఇందులో ఏజెంట్‌ సర్దార్‌ కంప్లీట్‌ చేసిన మిషన్‌ ఏంటి?

సంస్థ: ప్రిన్స్ పిక్చర్స్

తెలుగు విడుదల: అన్నపూర్ణ స్టూడియోస్‌

ఇవి కూడా చదవండి

నటీనటులు: కార్తి, రాశీఖన్నా, లైలా, రజీషా తదితరులు

రచన – దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌

సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌

కెమెరా: జార్జి సి విలియమ్స్

ఎడిటర్‌: రూబెన్‌

ఆర్ట్: కె.కదిర్‌

మాటలు: రాకేందు మౌళి

నిర్మాత: ఎస్‌.లక్ష్మణ్‌కుమార్‌

విజయ్‌ ప్రకాష్‌ (కార్తి) పోలీస్‌ ఆఫీసర్‌. అతని తండ్రి బోస్‌ మీద దోశద్రోహి అనే ముద్రపడుతుంది. ఆ నింద భరించలేక కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటుంది. అనాథగా ఉన్న విజయ్‌ని ఓ పోలీస్‌ ఆఫీసర్‌ తీసుకెళ్లి పెంచుకుంటాడు. విజయ్‌ చదువుకుని పోలీస్‌ అవుతాడు. తన తండ్రి వల్ల పడ్డ మచ్చ నుంచి బయటకు రావడానికి పబ్లిసిటీ మీద ఆధారపడతాడు. అతను ఇష్టపడే అమ్మాయి షాలిని అడ్వకేట్‌. సోషల్‌ యాక్టివిస్ట్ సమీరా (లైలా)కు సాయం చేస్తుంటుంది. సమీరకు టిమ్మీ (రిత్విక్‌) అనే కొడుకుంటాడు. అతనికి ప్లాస్టిక్‌ బాటిల్‌లో నీళ్లు తాగడం వల్ల అరుదైన వ్యాధి సోకి ఉంటుంది. తన కొడుకులాగా ఎవరూ ఇలాంటి వ్యాధుల బారిన పడకూడదని ఒన్‌ ఇండియా ఒన్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతుంది సమీరా. ఒన్‌ ఇండియా ఒన్ పైప్‌లైన్‌ ప్రాజెక్టు రాథోడ్‌ (చుంకీపాండే)కి చెందింది. అతను దేశంలోని నదులనన్నిటినీ సంధానం చేసే పైప్‌లైన్‌ పథకాన్ని ఇంటర్నేషనల్‌ కోర్టులో సబ్మిట్‌ చేసి చైనా మీద ఓ వాదనలో గెలుస్తాడు. ఈ మొత్తం మిషన్‌కీ సర్దార్‌కి ఓ సంబంధం ఉంటుంది. బోస్‌ అసలు సర్దార్‌గా ఎందుకు మారాడు? అతను దేశద్రోహి ఎలా అయ్యాడు? తన కొడుకు దృష్టిలో దోషిగా ఉన్న అతను అసలు అన్ని ఏళ్లు ఏమైపోయాడు? అతనికి రెడ్‌ కోడ్‌ని ఎవరు పంపారు? ఆంధ్రా యూనివర్శిటీ అల్లర్లకు సర్దార్‌ తప్పించుకోవడానికీ ఉన్న లింకేంటి? ఇలాంటి పలు రకాల ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.

కార్తి డ్యూయల్‌ రోల్‌లో నటించారు. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ ప్రకాష్‌కీ, బోస్‌ అలియాస్‌ సర్దార్‌ కేరక్టర్‌కీ చక్కగా న్యాయం చేశారు. గెటప్పుల నుంచి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుని చేశారు. డైరక్టర్‌ మిత్రన్‌ సినిమాల మీద కోలీవుడ్‌లో ఓ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. ఈ సినిమాతో మరోసారి తనమీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు డైరక్టర్‌. ఏదో స్పై సినిమా చేశామంటే చేశామన్నట్టు తీయకుండా, జనాన్ని ఆలోచింపజేసే నీళ్ల గురించి అందంగా కథ అల్లుకున్నారు. ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే ఇబ్బంది, తాగే నీటిని జాతీయ స్థాయిలో కమర్షియలైజ్‌ చేస్తే కలిగే అనర్థాలు వంటివాటిని చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగులో రాకేందు రాసిన డైలాగులు బావున్నాయి. తన తల్లి చనిపోయిన తర్వాత విజయ్‌తో కూర్చుని టిమ్మీ మాట్లాడే మాటలు ఎలాంటివారినైనా కదిలిస్తాయి. నటీనటులందరూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. కెమెరా పనితనం, ఆర్ట్ వర్క్ కూడా బావుంది. నేపథ్య సంగీతం కొన్నిచోట్ల హైలైట్‌ అనిపిస్తుంది. పాటలు సోసోగా ఉన్నాయి. ఫైట్లు భారీగా ఉన్నాయి.

లాయర్‌ కేరక్టర్‌లో రాశీఖన్నా, సోషల్‌ యాక్టివిస్ట్ గా లైలా, బోస్‌ భార్యగా రజీషా విజయన్‌ మెప్పించారు. మిలిటరీలో పనిచేసే వారికి ఇళ్లల్లో ఉండే గౌరవం, ఏజెంట్లకు దక్కని గౌరవం గురించి కూడా సున్నితంగా చర్చించారు సినిమాలో. సీక్వెల్స్ హవా నడుస్తున్న ఈ హయాంలో సర్దార్‌ కి కూడా సీక్వెల్‌ ఉందనే విషయాన్ని నర్మగర్భంగా చెప్పారు మిత్రన్‌.

– డా. చల్లా భాగ్యలక్ష్మి