Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొట్టోడే కానీ గట్టోడు.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన బుల్లి రాజు.. వీడియో ఇదిగో

బుల్లిరాజు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెగ మార్మోగిపోతోంది. విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఈ పాత్ర బాగా హైలెట్ అయ్యింది. సినిమా చూసిన ఆడియెన్స్ అందరూ బుల్లిరాజుగా ఈ బుడతడి నటన గురించి తెగ పొగిడేస్తున్నారు.

పొట్టోడే కానీ గట్టోడు.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన బుల్లి రాజు.. వీడియో ఇదిగో
Sankranthiki Vasthunnam Movie Child Artist
Follow us
Basha Shek

|

Updated on: Jan 19, 2025 | 8:36 AM

ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆడియెన్స్ ను తెగ అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే 130 కోట్లు కలెక్ట్ చేసి 150 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. కాగా ఈ సినిమా చూసిన వారందరూ ఒక పిల్లాడి గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అదే బుల్లిరాజు పాత్ర పోషించిన భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. మూవీలో వెంకటేశ్ కుమారుడి పాత్రలో రేవంత్ అదరగొట్టాడన్న కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. స్క్రీన్ పై ఈ బుడ్డోడు కనిపించినప్పుడల్లా థియేటర్లలోని ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకుంటున్నారట. ముఖ్యంగా గోదారి యాసలో ఈ పిల్లాడు చెప్పే డైలాగులకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారట. ఇలా అందరినీ నవ్విస్తున్న బుల్లిరాజు అలియాస్ రేవంత్ భీమల గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రేవంత్ భీమలది భీమవరం. చాలామంది లాగే ఈ పిల్లాడు కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అట. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన తరఫున ప్రచారం కూడా చేశాడట. ఈ విషయన్నిరేవంత్ నే చెప్పుకొచ్చాడు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుల్లి రాజు మాట్లాడుతూ.. ‘ పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనకు క్యాంపైన్ కూడా చేశాను. అన్ని ఇళ్లకు బ్యాలెట్ పేపర్లు పట్టుకొని ఓటు వేయాలని తిరిగాను. నేను అలా తిరిగింది వీడియో రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే అది వైరల్ గా మారింది. అదే సమయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు చూసి నన్ను ఆడిషన్ కి పిలిచారు. అలా నేను ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సెలెక్ట్ అయ్యాను’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో రేవంత్ గతంలో జనసేన కూటమికి ప్రచారం చేసిన వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఎన్నికల ప్రచారంలో బుల్లిరాజు.. వీడియో ఇదిగో..

.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.