AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: ‘పుష్ప 2లో నటిస్తానని నోరు తెరచి అడిగిన సుకుమార్ కూతురు.. ఆ కండిషన్ పెట్టిన క్రియేటివ్ డైరెక్టర్

దర్శక ధీరుడు రాజమౌళిలాగే సుకుమార్ కూడా చాలా ట్యాలెంటెడ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్. సినిమా మేకింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తాడు. ఈ క్రమంలో పుష్ప 2 సినిమాలో తనకు అవకాశం ఇవ్వమని సొంత కూతురే కోరినప్పటికీ దర్శకుడు సుకుమార్ అవకాశం ఇవ్వలేదట. ఈ విషయాన్ని సుకుమార్ కూతురు సుకృత వేణినే స్వయంగా చెప్పుకొచ్చింది.

Pushpa 2: 'పుష్ప 2లో నటిస్తానని నోరు తెరచి అడిగిన సుకుమార్ కూతురు.. ఆ కండిషన్ పెట్టిన క్రియేటివ్ డైరెక్టర్
Director Sukumar
Basha Shek
|

Updated on: Jan 17, 2025 | 1:19 PM

Share

తెలుగు సినిమా హీరోలతో పాటు దర్శకులు కూడా ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హీరోల సంగతి పక్కన పెడితే రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక పుష్ప 2 సినిమాతో సుకుమార్ కూడా వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు. వీరి విజయానికి కారణం సినిమా మేకింగ్ లో కాంప్రమైజ్ కాకపోవడమేనని తెలుస్తోంది. సుకుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా సినిమా ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. సుకుమార్ భార్య బబిత నిర్మాతగా సత్తా చాటుతుంటే, కూతురు సుకృతి వేణి నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు( చిత్రం జనవరి 24న థియేటర్లలో రిలీజ్ కానుంది.దీంతో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం (జనవరి 17) చిత్ర బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశానికి సుకుమార్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ కూతురు సుకృతి వేణి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

మీ నాన్నగారి సినిమాల్లో ఎందుకు నటించలేదు? అని ఒక విలేకరి సుకుమార్ కూతురిని అడిగాడు. దీనికి సుకృతి ఇలా సమాధానమిచ్చింది. ‘ నేను పుష్పలో, పుష్ప 2లో నటిస్తానని నాన్నను అడిగాను. ఎందుకంటే మా టీచర్స్, ఫ్రెండ్స్, నాకు తెలిసినవాళ్లు అందరూ నువ్వు పుష్పలో యాక్ట్ చేస్తున్నావా అని అడిగేవారు. దానికి నాకే చేయాలని అనిపించలేదని చెప్పేదాన్ని. ఇంకొందరు నేను చిన్నపిల్లను కదా అందుకే యాక్ట్ చేయలేదని అనుకున్నారు. కానీ నిజంగా జరిగింది అది కాదు. ‘పుష్ప’, ‘పుష్ప 2′ సినిమాల్లో పాత్ర కోసం అడిగాను. కానీ మా నాన్న నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. బదులుగా నన్ను ఆడిషన్‌కు రమ్మన్నారు’ అని అసలు విషయం చెప్పుకొచ్చింది సుకృతి. దీంతో సొంత కూతురికి కూడా ఒక రోల్ ఇవ్వాలంటే ఆడిషన్ పెట్టే తండ్రి సుకుమార్ గ్రేట్ అన్న కాంప్లిమెంట్స వినిపిస్తున్నాయి.

గాంధీ తాత చెట్టు’ సినిమా ఓ స్కూల్‌ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఓ అమ్మాయి మొక్కను కాపాడే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రానికి పద్మావతి మల్లాది దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్, గోపీటాకీస్‌ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు ఈ సినిమాను నిర్మించారు.  జనవరి 24న  ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

గాంధీ తాత చెట్టు సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై