Saif Ali Khan: గతంలోనూ సైఫ్‌పై దుండగుల దాడి.. ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్న స్టార్ నటుడు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుల దాడి బాలీవుడ్ లోనే కాదు యావత్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఈ దాడిలో సైఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ముందు జాగ్రత్తగా వైద్యులు సర్జరీ కూడా పూర్తి చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గురువారం (జనవరి 16) తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడిన ఆ దుండగుడు 6 సార్లు కత్తితో అతనిని పొడిచాడు. సైఫ్ ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సర్జరీ కూడా పూర్తయింది. దుండగుడి దాడిలో సైఫ్ మెడ, ఎడమ మణికట్టు, ఛాతీ, వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెన్నుపాముకు కూడ గాయం కావడంతో అత్యవసర ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని సమాచారం. కాగా గతంలో రెండుసార్లు ఇలాగే దుండుగుల దాడిలో తీవ్రంగా గాయ పడ్డాడు సైఫ్. సైఫ్‌పై కత్తి పోటు దాడి నేపథ్యంలో ఈ నటుడ పాత కథ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఢిల్లీలోని ఓ నైట్ క్లబ్‌లో సైఫ్‌పై దాడి జరిగింది. నేహా ధూపియా పోడ్‌కాస్ట్ షో ‘నో ఫిల్టర్ నేహా’లో సైఫ్ స్వయంగా ఈ ఆలోచనను పంచుకున్నాడు. ‘నేను ఢిల్లీలోని నైట్‌క్లబ్‌లో కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. దయచేసి నా స్నేహితురాలితో కలిసి డ్యాన్స్ చేయండి. అందుకు నేను నో చెప్పాను. బయట ఇలాంటివి నాకు నచ్చవు’ అని సున్నితంగా చెప్పాను. ఆ తర్వాత అతన నన్ను దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. అంతేకాదు విస్కీ బాటిల్‌తో నా తలపై కొట్టాడు. అంతే నా తల నుంచి రక్తస్రావం మొదలైంది. అక్కడి నుంచి నేను వాష్‌రూమ్‌కి వెళ్లాను. అతను కూడా వాష్‌రూమ్ లోకి వచ్చేశాడు. . నా తల నుంచి విపరీతంగా రక్తం కారుతోంది. దీంతో నీటితో శుభ్రం చేసుకుంటుండగా ‘ ఆ వ్యక్తితో, నువ్వు ఏమి చేసావో చూడు అని అన్నాను. అతనికి చాలా కోపం వచ్చింది. మళ్లీ నాపై దాడి చేశాడు. అతను వెర్రివాడు. నన్ను చంపేస్తానన్నాడు’ అని అప్పటి ఘటనను పంచుకున్నాడు సైఫ్.
కాగా సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు అతని అభిమానులు కూడ సైఫ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు సైఫ్ పై జరిగిన దాడి గురించి తెలియగానే షారూఖ్ ఖాన్ ఆసుపత్రికి చేరుకున్నారు. తన పనిని మధ్యలోనే వదిలేసి తమ స్నేహితుడి ఆరోగ్యం గురించి ఆరా తీసేందుకు ఆసుపత్రికి వచ్చాడు. షారుక్ ఖాన్ తన రోల్స్ రాయిస్‌లో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ సైఫ్ కు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నాడు. కరీనాకు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు. షారుఖ్ ఖాన్, సైఫ్ అలీఖాన్ పలు చిత్రాల్లో కలిసి నటించారు. అలా షారుక్‌కి ఈ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఇక ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి తదితర హీరోలు సైఫ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.