Saif Ali Khan: సైఫ్ వెన్నెముక నుంచి రెండున్నర అంగుళాల కత్తిని బయటికి తీసిన వైద్యులు
సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో కీలక పురోగతి సాధించారు ముంబై పోలీసులు. దాడి చేసిన వ్యక్తిని.. అతను ఎలా ఇంటి లోపలికి వచ్చాడో గుర్తించారు. స్థానిక పోలీసులతో పాటు, ముంబై క్రైమ్ బ్రాంచ్ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది. అలాగే, సైఫ్ హెల్త్ కండీషన్‌పై కీలక ప్రకటన చేశారు ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యులు. ఆ డిటైల్స్ తెలుసుకుందాం పదండి...
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన వెన్నెముకకు తీవ్రగాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసి వెన్నెముక నుంచి రెండున్నర అంగుళాల కత్తిని తొలగించినట్లు వివరించారు. ఫ్లూయిడ్ లీకేజీని అరికట్టడానికి సైఫ్ వెన్నెముకకు మేజర్ సర్జరీ చేసినట్లు తెలిపారు. సైఫ్ అలీఖాన్ మెడ, ఎడమ చేతికి మరో రెండు ప్లాస్టిక్ సర్జరీలు చేసినట్లు వివరించారు. మూడు మేజర్ సర్జరీల తర్వాత సైఫ్‌ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. సైఫ్ అలీఖాన్ ప్రాణానికి ప్రమాదం లేదన్నారు లీలావతి ఆస్పత్రి వైద్యులు. ప్రస్తుతం సైఫ్‌కి ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు చెప్పారు. ఒకటి లేదా రెండు రోజుల్లో అతన్ని జనరల్ వార్డుకు మార్చాలని భావిస్తున్నట్లు వివరించారు.
VIDEO | Doctor Nitin Dange, Neurosurgeon at Lilavati Hospital, provides an update on actor Saif Ali Khan's condition. Saif Ali Khan was admitted to the hospital after being attacked by an intruder early this morning at his Bandra home: Here's what he said:
"Mr Saif Ali Khan was… pic.twitter.com/2mWNTBVzAb
— Press Trust of India (@PTI_News) January 16, 2025
సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో వీడుతోన్న మిస్టరీ వీడుతోంది. చోరీకి వచ్చిన దొంగే.. సైఫ్‌పై దాడి చేసినట్టు గుర్తించారు పోలీసులు. పక్క ఇంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఓ వ్యక్తి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్టు ఆధారాలు సేకరించారు. నిందితుడు పారిపోతుండగా దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామంటున్నారు ముంబై పోలీసులు. సైఫ్ ఇంట్లో ఫోరెన్సిక్ టీమ్ ఫింగర్ ప్రింట్స్‌ను సేకరించింది.
బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ నివాసంలో గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన జరిగింది. సైఫ్ తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి నిద్రిస్తున్నసమయంలో ఓ వ్యక్తి ఆయన చిన్న కుమారుడు జేహ్ గదిలో దూరినట్లు తెలిసింది. అయితే దుండగుడిని చూసిన జేహ్ కేర్‌టేకర్ బిగ్గరగా కేకలు వేసింది. దీంతో సైఫ్ వెనువెంటనే.. అక్కడికి చేరుకొన్న సమయంలో ఆ వ్యక్తి సైఫ్‌పై దాడికి దిగి ఆయన్ను గాయపరిచాడు. ఈ దాడిలో సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.