Manchu Manoj: ‘మీరిక్కడ ఉండొద్దు..’ మంచు మనోజ్‌కు పోలీసుల సూచన

ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీలో వివాదాలకు ఎండ్ కార్డు పడేలా కనిపించడం లేదు. తిరుపతిలోని మోహన్‌బాబుకు చెందిన వర్సిటీ వద్ద జరిగిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా లాఠీఛార్జ్ చేసేవరకు వెళ్లింది వ్యవహారం. తాజాగా తనపై, తన భార్యపై దాడి చేశారంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు మనోజ్.

Manchu Manoj: 'మీరిక్కడ ఉండొద్దు..' మంచు మనోజ్‌కు పోలీసుల సూచన
Manchu Manoj At Police Station
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 16, 2025 | 2:57 PM

తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర బుధవారం జరిగిన ఘటనపై మంచు మనోజ్‌ స్పందించారు. గొడవలు సృష్టించడం తన ఉద్దేశం కాదన్నారు. తమ ఫ్యాన్స్‌ ఏర్పాటు చేసిన బ్యానర్లు తీసేయడం, వారిని బెదిరించడంతోనే వివాదం జరిగిందని చెప్పారు. రెండు రోజులుగా అక్కడే ఉన్న తమను సంక్రాంతి జరుపుకోకుండా చేశారని ఆరోపించారు. ఇక.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో ఎలాంటి ఫ్యామిలీ విషయాలు చర్చించలేదని తెలిపారు. అలాగే.. తనకు హెల్ప్‌ చేయాలని కూడా ఎవరినీ అడగలేదన్నారు మంచు మనోజ్‌. తాజాగా  తనపై, తన భార్య మౌనికపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారంటూ చంద్రగిరి పోలీసు స్టేషన్‌లో మంచు మనోజ్‌ గురువారం కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా..  శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి నుంచి వెళ్లిపోవాలని మనోజ్‌కు పోలీసులు సూచించారు.

బుధవారం మోహన్‌బాబు యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు మంచు మనోజ్ దంపతులు. అయితే సెక్యూరిటీ సిబ్బంది మాత్రం లోనికి పంపించేందుకు నిరాకరించారు. అదే సమయంలో కోర్టు ఉత్తర్వుల దృష్ట్యా తాము కూడా అనుమతించలేమన్నారు పోలీసులు. గేటు తీయాలంటూ చాలాసేపు వర్సిటీ ఎదుటే నిరీక్షించారు మనోజ్ దంపతులు. అప్పటికే చాలామంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఉద్రిక్త పరిస్థితి మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు మంచు మనోజ్‌. యూనివర్సిటీకి వస్తున్నానని తెలిసి కొంతమంది బౌన్సర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. వాళ్లకు భయపడే పరిస్థితి లేదన్నారు. కేవలం పోలీసుల మాట విని మాత్రమే వెళ్లిపోతున్నానని అన్నారు మనోజ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..