ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
నెల్సన్! కోలీవుడ్ లో ఇప్పుడు తోపెస్ట్ డైరెక్టర్. కాదు కాదు.. జైలర్ సినిమాతో.. ఏకంగా రజినీకాంత్‌కే ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చి సక్సెస్ కొట్టిన డైరెక్టర్ ! మామూలు కథకు .. రజినీ అప్పియరెన్స్‌ను యాడ్ చేసి.. తన మేకింగ్‌తో.. మ్యాజిక్ చేసిన డైరెక్టర్. పిక్చరైజేషన్‌లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్. అలాంటి ఈ డైరెక్టర్ ఇప్పుడు మళ్లీ రజినీతోనే మన ముందుకు వస్తున్నాడు.
జైలర్ కు సీక్వెల్‌గా జైలర్ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా మకర సంక్రాంతి కానుకగా తన స్టైల్లో అనౌన్స్‌మెంట్ టీజర్‌ను రిలీజ్ చేసి.. అందర్నీ ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేశాడు నెల్సన్. సాధారణంగా తన ప్రతీ సినిమాను ఓ కొత్త కాన్సెప్ట్‌తోనే అనౌన్స్ చేస్తాడు నెల్సన్. పైగా తనతో పని చేసే మ్యూజిక్ డైరెక్టర్‌ను.. హీరోను ఈ అనౌన్స్‌మెంట్ ప్రోమోలో భాగం చేస్తుంటాడు. జైలర్ అనౌన్స్మెంట్ అప్పుడు ఇదే చేశాడు. ఇక ఇప్పుడు జైలర్ 2 కి ఇదే చేశాడు. ఎప్పటిలానే అనిరుధ్, రజినీతో కలిసి ఓ కాన్సెప్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోను నెల్సన్ తెరకెక్కించాడు. అయితే ఈ సారి ఈ టీజర్‌నే పవర్ పాక్డ్ మాస్ ఎలిమెంట్స్‌తో నింపేశాడు. అనిరుధ్, నెల్సన్ జైలర్ 2 సినిమా గురించి మాట్లాడుకుంటుండగా… రజినీ మాస్ యాక్షన్ తుఫాను వచ్చినట్టు చూపించాడు. దీంతో బిత్తర పోయిన అనిరుధ్, నెల్సన్ దాక్కున్నట్టు.. ఫన్నీగా చూపించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్
TOP 9 ET News: వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్ | కలెక్షన్స్ కుమ్మడంలో ‘డాకు’ నెం1
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో.. ఇలా!
అవాక్కయ్యేలా చేసిన జానీ మాస్టర్ కొడుకు.. గేమ్ ఛేంజర్ గురించి భలేగా మాట్లాడాడు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. ఏంటా అని వెళ్లి చూడగా!