గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో.. ఇలా!
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా గుర్తింపు తెచ్చుకున్న మహా కుంభమేళా జనవరి 13న అట్టహాసంగా ప్రారంభమైంది. సుమారు 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభామేళా కోసం సాధువులు, భక్తులు తండోపతండాలుగా ప్రయాగ్‌రాజ్ కు తరలివస్తున్నారు.
ఈ క్రమంలోనే కుంభమేళాలో సాధ్వి వేషంలో ఒక ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ కనిపించింది. దీంతో ఆమెను ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూ చేయగా.. ఆమె చెప్పిన మాటలు.. కామెంట్లు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆమె పేరు హర్ష రిచార్య. ఉత్తరాఖండ్ స్వస్థలం. సాద్విగా మారిన ఈమెను.. ఓ యూట్యూబర్ పలకరించి ఆమె మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆమె.. ఉత్తరాఖండ్ నుంచి వచ్చానని.. ఆచార్య మహామండలేశ్వరుని శిష్యురాలినంటూ చెప్పింది. తన వయసు 30 ఏళ్లని.. తన జీవితంలో చాలా చూశాను..నటించానంటూ తన జీవితం గురించి చెప్పడం మొదలెట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అవాక్కయ్యేలా చేసిన జానీ మాస్టర్ కొడుకు.. గేమ్ ఛేంజర్ గురించి భలేగా మాట్లాడాడు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. ఏంటా అని వెళ్లి చూడగా!
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్ దిగిన తల్లి.. ఇంతలోనే..
అమానుషం.. కాళ్లు కట్టి, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..