అమానుషం.. కాళ్లు కట్టి, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
వీధి శునకాలపై కొందరు అమానుషంగా ప్రవర్తించారు. వాటి కాళ్లు కట్టేసి, మూతులు కుట్టేసి 40 అడుగుల బ్రిడ్జిపై నుంచి కిందపడేశారు. ఈ ఘటనలో 20 శునకాలు ప్రాణాలు కోల్పోయాయి. మరో 11 కుక్కలు తీవ్రంగా గాయపడ్డాయి. సంగారెడ్డి జిల్లాలోని ఎద్దుమైలారం శివారులో ఈ నెల 4న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు 31 వీధి కుక్కలకు కాళ్లు కట్టేసి, మూతులు కుట్టేసి బ్రిడ్జిపై నుంచి కిందికి విసిరేశారు. వీటిలో 20 శునకాలు అక్కడికక్కడే మృతి చెందాయి. అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు చనిపోయిన శునకాలను చూసి వెంటనే జంతు ప్రేమికులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన శునకాలను నాగోల్‌లోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శునకాలను ఎవరైనా కావాలనే అలా పడేశారా? లేదంటే వాటిని చంపి పడేశారా? అని ఆరా తీస్తున్నారు. చనిపోయిన శునకాల నమూనాలు సేకరించి పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము.. సీన్ కట్ చేస్తే..
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!

