ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ప్రముఖ సోషల్ మీడియా సంస్త మెటా అధినేత తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. ఫేస్ బుక్, ఇన్‌స్టానుంచి ఖాతాదారులు తమ ఖాతాలను డిలీట్ చేస్తున్నారు. మెటా తీసుకున్న నిర్ణయం బూమ్ రాంగ్ లా మారింది. సోషల్ మీడియాలో పారదర్శకత ఉండాలనే స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి రావడంతో సమాచారవ్యాప్తి వేగంగా జరుగుతోంది.
అదే సమయంలో తప్పుడు, నిరాధార వార్తలు కూడా జనంలోకి వేగంగా వెళుతున్నాయి. ఈ క్రమంలోనే పలు సామాజిక మాధ్యమాలు ‘ఫ్యాక్ట్ చెకింగ్’ ప్రమాణాలను పాటిస్తున్నాయి. తమ యూజర్లు పెట్టే పోస్టులకు సంబంధించి క్రాస్ చెకింగ్ కు ఏర్పాట్లు చేశాయి. ఇందులో భాగంగా ఏదేని పోస్టుపై మిగతా యూజర్లు సందేహం వ్యక్తం చేస్తే సాంకేతికత సాయంతో క్రాస్ చెకింగ్ చేసి నిజాలు వెల్లడించే అవకాశం కల్పిస్తున్నాయి. సోషల్ మీడియాలో పారదర్శకతకు ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ సాయపడుతున్నాయి. అయితే, మెటా కంపెనీ ఈ ఫ్యాక్ట్ చెకింగ్ వ్యవస్థను వినియోగించకూడదని తాజాగా నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన ఫేస్ బుక్, ఇన్ స్టా సహా పలు సామాజిక మాధ్యమాలలో పెట్టే పోస్టులకు ఫ్యాక్ట్ చెకింగ్ మెజర్స్ పాటించబోమని ప్రకటించింది. ఈ నిర్ణయంపై సాంకేతిక నిపుణులతో పాటు ఫేస్ బుక్, ఇన్ స్టా యూజర్ల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. మెటా నిర్ణయాన్ని నిరసిస్తూ యూజర్లు తమ ఫేస్ బుక్, ఇన్ స్టా ఖాతాలను డిలీట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము.. సీన్ కట్ చేస్తే..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

