బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..

బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..

Phani CH

|

Updated on: Jan 16, 2025 | 1:05 PM

సాధారణంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు మొదట ఎంచుకునేది రైలు. చిన్న పిల్లలు, వృద్ధులతో కలిసి ప్రయాణించాల్సి వచ్చినప్పుడు దీనిని మించిన సౌకర్యవంతమైన ప్రయాణం మరొకటుండదు. అయితే రైల్లో ప్రయాణించేటప్పుడు నీళ్లకోసమో, మరేదైనా అవసరం కోసమో స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు రైలు దిగి మళ్లీ ఎక్కుతుంటారు.

ఓ మహిళ తన పసిబిడ్డతో కలిసి రైల్లో ప్రయాణిస్తూ.. ఏదో స్టేషన్‌లో రైలు ఆగడంతో తన బిడ్డను ట్రైన్ లోనే ఉంచి.. పాలు కోసం స్టేషన్ లో దిగింది. పాలు తీసుకొని వెనక్కి తిరిగి వచ్చేలోపు రైలు కదిలిపోయింది. దాంతో ఆ తల్లి పడిన ఆవేదన చూపరులను కంటతడి పెట్టించింది. మహిళ పరుగెత్తుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే రైలు వేగం పుంజుకుంది. కదులుతున్న రైలును చూస్తూ… తన పిల్లాడిని తలచుకుని నిస్సహాయ స్థితిలో ఆ తల్లి ఏడుస్తూ ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తోంది. ఇది చూసి అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఇంతలో అక్కడే ఉన్న రైల్వే గార్డ్‌ ఆ మహిళను చూసి ఏం జరిగిందని అడిగాడు. విషయం చెప్పగానే అతను స్పందించి రైలును ఆపాడు. వెంటనే ఆ మహిళ అతనికి కృతజ్ఞతలు చెప్పి తన బిడ్డకోసం రైలు వైపు పరిగెత్తింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమానుషం.. కాళ్లు కట్టి, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..

ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??

ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము.. సీన్ కట్ చేస్తే..