ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. ఏంటా అని వెళ్లి చూడగా!

ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. ఏంటా అని వెళ్లి చూడగా!

Phani CH

|

Updated on: Jan 16, 2025 | 1:40 PM

ఓ యువకుడు రోజూ బకెట్‌తో నీళ్లు తీసుకెళ్లి స్మశానంలోని సమాధులకు పోస్తున్నాడు. చాలామంది వీడిదెంత మంచి మనసు పాపం.. చనిపోయిన ఆత్మలకు నీళ్లిచ్చి దాహం తీర్చుతున్నాడు అనుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా అప్పుడప్పుడూ మాత్రమే చేస్తారు కానీ ఈ యువకుడు మాత్రం ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీళ్లు తీసుకెళ్లి సమాధుల మధ్య పోస్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది.

విషయం పోలీసులకు చేరవేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి వెళ్లి చూసి షాకయ్యారు. గంజాయికి బానిసైన ఓ యువకుడు ప్రతిసారీ గంజాయిని కొనడం కష్టంగా మారడంతో ఏకంగా తానే సొంతంగా పండించుకోవడం మొదలుపెట్టాడు. ఇంట్లో పెంచితే పోలీసులు, చుట్టుపక్కలవారికి అనుమానం వస్తుందని, ఎవరూ ఊహించని విధంగా స్మశానంలో గంజాయి సాగు మొదలుపెట్టాడు. అదికూడా సమాధుల మధ్య గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. ఈక్రమంలో రోజూ వాటికి నీళ్లు పోస్తుండటంతో స్థానికులకు అనుమానం రానే వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో బాబ్జి అనే వ్యక్తి గత కొద్ది నెలలుగా వెల్డర్ గా పనిచేస్తున్నాడు. అయితే గత కొన్ని నెలలుగా గంజాయికి అలవాటు పడ్డాడు. ప్రతీసారి గంజాయి కొనుక్కోవడం బాబ్జీకి ఇబ్బందిగా మారిందట. దీంతో ఏకంగా ఆ మొక్కలనే పెంచాలని డిసైడ్ అయ్యాడు. గుట్టు చప్పుడు కాకుండా స్మశానంలో సమాధుల మధ్య మొక్కలని పెంచడం ప్రారంభించాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..

అమానుషం.. కాళ్లు కట్టి, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..

ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??

ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము.. సీన్ కట్ చేస్తే..