50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్
ప్రస్తుతం సినిమా రేంజ్ మారిపోయింది. ఎక్కడ చూసిన పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ప్రతీ సినిమా వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అలాగే సినిమాల వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి. దాంతో హీరో హీరోయిన్స్ కూడా భారీగా రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు. పాత్ర నిడివితో.. చేసే క్యారెక్టర్‌తో సంబంధం లేకుండా ప్రొడ్యూసర్ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.
అలా నయన్ కూడా.. ఓ చిన్న యాడ్ కోసం దాదాపు 5 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేశారట. మొత్తానికి తీసుకున్నారట. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే లేడీ సూపర్ స్టార్‌గా.. సౌత్ సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నయన్… 50 సెకండ్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకుందట. ఓ డీటీహెచ్ యాడ్ షూట్లో పాల్గొన్న ఈమె.. ఈ భారీ మొత్తాన్ని తన రెమ్యునరేషన్‌గా ఛార్జ్ చేసిందట. ఇక నయనతార ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. ఒక్కో సినిమాకు నయన్ దాదాపు 12 కోట్ల నుంచి 15 కోట్లవరకు వసూల్ చేస్తోంది. సినిమాలతో పాటే.. యాడ్స్‌లోనూ తన హవా చూపిస్తూ… భారీగా రెమ్యునరేషన్ అందుకుంటోంది ఈమె.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్ | కలెక్షన్స్ కుమ్మడంలో ‘డాకు’ నెం1
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో.. ఇలా!
అవాక్కయ్యేలా చేసిన జానీ మాస్టర్ కొడుకు.. గేమ్ ఛేంజర్ గురించి భలేగా మాట్లాడాడు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. ఏంటా అని వెళ్లి చూడగా!
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్ దిగిన తల్లి.. ఇంతలోనే..