AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautham Menon: సూర్య నో చెప్పడాన్ని తట్టుకోలేకపోయా.. ఎంతో బాధపడ్డాను.. డైరెక్టర్ ఎమోషనల్..

దాదాపు ఏడేళ్ల క్రితమే షూటింగ్ కంప్లీట్ అయిన ఓ సినిమా ఇప్పటికీ అడియన్స్ ముందుకు రాలేదు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ రూపొందించిన ఈ మూవీలో హీరో విక్రమ్ చియాన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. అనివార్య కారణాలతో రిలీజ్ కాలేదు. ఈ సినిమా విడుదల కోసం డైరెక్టర్ ఎంతో ప్రయత్నిస్తున్నారు.

Gautham Menon: సూర్య నో చెప్పడాన్ని తట్టుకోలేకపోయా.. ఎంతో బాధపడ్డాను.. డైరెక్టర్ ఎమోషనల్..
Gautham Menon, Suriya
Rajitha Chanti
|

Updated on: Jan 19, 2025 | 7:51 AM

Share

డైరెక్టర్ గౌతమ్ మీనన్.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ కొన్నాళ్లుగా ఆయన సినిమాలకు అంతగా రెస్పాన్స్ రావడం లేదు. దర్శకుడిగా వెండితెరపై ఎన్నో కథలను రూపొందించిన ఆయన.. ఆ తర్వాత నటుడిగానూ మెప్పించాడు. పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే కొన్ని రోజులుగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఆయన తెరకెక్కించిన ధృవ నక్షత్రం సినిమా విడుదలకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాదాపు ఏడేళ్ల క్రితమే సిద్ధమైన ఆ మూవీ అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మీనన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాను తప్పకుండా అడియన్స్ ముందుకు తీసుకువస్తానని అన్నారు.

అయితే ధృవ నక్షత్రం చిత్రంలో విక్రమ్ చియాన్ హీరోగా నటించాడు. కానీ అతడి కంటే ముందే పలువురు హీరోలకు ఈ సినిమా స్టోరీ చెప్పానని అన్నారు గౌతమ్. “ధృవ నక్షత్రం కథను ముందుగా వేరే హీరోలకు చెప్పాను. కానీ కొన్ని కారణాలతో అందరూ రిజెక్ట్ చేశారు. వారి అభిప్రాయాలను నేను అర్థం చేసుకున్నాను.. అందుకే నాకేం బాధ అనిపించలేదు. కానీ ఈ కథను హీరో సూర్య సైతం నో చెప్పాడు. ఆ మాటను తట్టుకోలేకపోయాను. సూర్య నో చెప్పడం నన్ను ఎంతోగానో బాధించింది” అంటూ చెప్పుకొచ్చారు.

ధృవ నక్షత్రం సినిమా విడుదల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నానని.. తప్పకుండా ఆ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకువస్తామని అన్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు అస్సలు బోర్ కొట్టదని.. ఇప్పటితరం అడియన్స్ కచ్చితంగా ఈ చిత్రాన్ని ఇష్టపడతారని అన్నారు. దాదాపు 12 ఏళ్ల క్రితం తెరకెక్కించిన మదగజ రాజు సినిమా ఇప్పుడు విడుదలై సక్సెస్ కావడం ఆనందంగా ఉందన్నారు. అలాగే ధృవ నక్షత్రం సినిమా సైతం మంచి విజయాన్ని అందుకుంటుందని గౌతమ్ మీనన్ అన్నారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

మళ్లీ రెచ్చిపోయిన హార్దిక్..ఈసారి ఏకంగా టీవీ కామెంటేటర్ మీదే
మళ్లీ రెచ్చిపోయిన హార్దిక్..ఈసారి ఏకంగా టీవీ కామెంటేటర్ మీదే
హోమ్ లోన్ తీసుకునే ముందు ఇవి పక్కా తెలుసుకోండి.. ఇలా చేస్తే మీకు
హోమ్ లోన్ తీసుకునే ముందు ఇవి పక్కా తెలుసుకోండి.. ఇలా చేస్తే మీకు
టోన్డ్ మిల్క్ లేదా నార్మల్ మిల్క్... ఏది బెటర్? నిపుణుల మాట ఇదే
టోన్డ్ మిల్క్ లేదా నార్మల్ మిల్క్... ఏది బెటర్? నిపుణుల మాట ఇదే
కొబ్బరి లేకుండా కొబ్బరి చట్నీ తయారు చేయోచ్చని తెలుసా..
కొబ్బరి లేకుండా కొబ్బరి చట్నీ తయారు చేయోచ్చని తెలుసా..
గోల్డ్‌.. సామాన్యులకు ఇక అందని ద్రాక్షేనా..!
గోల్డ్‌.. సామాన్యులకు ఇక అందని ద్రాక్షేనా..!
ఎన్నికల బరిలోకి కేసీఆర్ కూతురు.. సింహం గుర్తుతోరంగంలోకి
ఎన్నికల బరిలోకి కేసీఆర్ కూతురు.. సింహం గుర్తుతోరంగంలోకి
బరువు తగ్గాలని ఆ పౌడర్‌ తిని.. అంతలోనే అనంతలోకాలకు
బరువు తగ్గాలని ఆ పౌడర్‌ తిని.. అంతలోనే అనంతలోకాలకు
దుర్గమ్మ ఆలయం నుంచి ఫోన్ కాల్..నమ్మారో..అంతే సంగతులు
దుర్గమ్మ ఆలయం నుంచి ఫోన్ కాల్..నమ్మారో..అంతే సంగతులు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
నాగార్జున, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్.. గుర్తుపట్టారా.. ?
నాగార్జున, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్.. గుర్తుపట్టారా.. ?