AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viduthalai Part 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి లేటెస్ట్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం విడుదల పార్ట్ 2. గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా విడుదల పార్ట్ 1 కు ఇది సీక్వెల్. స్టార్‌ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

Viduthalai Part 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి లేటెస్ట్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
Viduthalai Part 2
Basha Shek
|

Updated on: Jan 19, 2025 | 7:29 AM

Share

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి , వెర్సటైల్‌ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ కాంబినేషన్‌లో వచ్చిన విడుదల 1 సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన చిత్రమే విడుదల పార్ట్ 2. విజయ్ సేతుపతితో పాటు సూరి, మంజు వారియర్, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, భవానీ శ్రీ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకసారి రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. విజయ్ సేతుపతి, సూరి, మంజూ వారియర్ ల అద్భుతమైన నటన, వెట్రి మారన్ టేకింగ్ ఆడియెన్స్ ను ఫిదా చేశాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. విడుదల పార్ట్ 2 సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (జనవరి19) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం తమిళ్ తో పాటు తెలుగు భాషలోనూ విడుదల పార్ట్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. కాగా విడుదల పార్ట్‌ 1 కూడా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు జీ 5 ఓటీటీలోనూ విడుదల పార్ట్ 2 సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరో పది రోజులకు జీ 5లో కూడా విజయ్ సేతుపతి స్ట్రీమింగ్ కానుంది. ఆర్ ఎస్ ఇన్ఫోటైన్ మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్ పై కుమార్, వెట్రి మారన్ విడుదల పార్ట్ 2 సినిమాను నిర్మించారు. ఇళయ రాజా స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో విడుదల పార్ట్ 2 ను మిస్ అయ్యారా? విజయ్ సేతుపతి సినిమాలంటే మీకు ఇష్టమా? అయితే వీ వీకెండ్ లో విడుదల పార్ట్ 2 ఓ మంచి ఛాయిస్.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

తెలుగులోనూ చూడొచ్చు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..