Samantha: ‘మీరు వినాల్సి వస్తే.. ఎప్పటికీ ఒంటరిగా నడవరు’.. ఇంతకీ సామ్ ఏం చెప్పాలనుకుంటుందబ్బా..
తాజాగా సామ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముఖం చూపించకుండా సెల్ఫీ తీసుకుంది. ఆమె ధరించిన టీషర్ట్ మీద నువ్వు ఎప్పటికీ

కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన హీరోయిన్ సమంత.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యింది. ఉన్నట్టుండి నెట్టింట సామ్ ఎలాంటి పోస్ట్స్ చేయకుండా.. దూరంగా ఉండడంతో ఆమె అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతుందంటూ రూమర్స్ హల్చల్ చేశాయి. సామ్ అరుదైన చర్మ సమస్యతో ఇబ్బందిపడుతుందని.. ఇందుకు చికిత్స తీసుకునేందుకు విదేశాలకు వెళ్లనున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడిచింది. అయితే అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపడేశారు సమంత మేనేజర్. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. ప్రస్తుతం ఆరోగ్యాంగానే ఉన్నారని చెప్పారు. ఇక తాజాగా సామ్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముఖం చూపించకుండా సెల్ఫీ తీసుకుంది. ఆమె ధరించిన టీషర్ట్ మీద నువ్వు ఎప్పటికీ ఒంటరిగా నడవరు అని ఉంది. తన సెల్ఫీ పిక్ పోస్ట్ చేస్తూ ” ఒకవేళ మీరు ఇది వినాల్సి వస్తే… మీరెప్పటికీ ఒంటరిగా నడవరు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఇక ప్రస్తుతం సమంత చేసిన పోస్ట్ ఫిల్మ్ సర్కిల్లో చర్చనీయాశంంగా మారింది. ఇంతకీ సామ్ ఏం చెప్పాలనుకుంటుంది ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం సామ్..ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమవుతుంది సామ్. వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ చిత్రంలో నటిస్తోంది. ఇందుకోసం ఇటీవలే సామ్ అమెరికా వెళ్లినట్లుగా సమాచారం.




ఇదివరకు సామ్.. తన పెంపుడు కుక్క ఫోటో షేర్ చేస్తూ.. వెనక్కు తగ్గాను.. కానీ ఓడిపోలేదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సామ్ షేర్ చేసిన పోస్ట్ పై డైరెక్టర్ శివ నిర్వాణ స్పందిస్తూ.. ఎప్పటికప్పుడు బలంగా ఉండూ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక చాలా రోజుల తర్వాత సామ్ ఇలా మరోసారి మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుండడంతో ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. స్టే స్ట్రాంగ్ మామ్.. మిస్ యూనివర్స్.. పైనల్లీ యూఆర్ బ్యా్క్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




