AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponniyin Selvan 11th Day Collections: బాక్సాఫీస్ రికార్డ్ బద్దలు కొట్టిన మణిరత్నం.. ఆగని పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్స్ సునామి..

పొన్నియన్ సెల్వన్ నిర్మాతల ప్రకారం, ఈ చిత్రం USA, UK, ఆస్ట్రేలియా, సింగపూర్ , మలేషియాలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అటు కర్ణాటకలోనూ పొన్నియిన్ సెల్వన్ మంచి వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

Ponniyin Selvan 11th Day Collections: బాక్సాఫీస్ రికార్డ్ బద్దలు కొట్టిన మణిరత్నం.. ఆగని పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్స్ సునామి..
Ponniyin Selvan
Rajitha Chanti
|

Updated on: Oct 11, 2022 | 12:39 PM

Share

బాక్సాఫీస్ రికార్డ్ బద్దలు కొడుతూ దూసుకుపోతుంది పొన్నియిన్ సెల్వన్ చిత్రం. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. హిస్టారికల్ ఫిక్షం చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసి… ఇప్పుడు రూ. 500 కోట్ల మార్క్ కు చేరవవుతుంది. అమెరికా.. ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్, మలేషియాలో అత్యధిక వసూళ్లు సాధించింది ఈ మూవీ. ఇక ఇదే జోరు కొనసాగితే రానున్న రోజుల్లో మరిన్ని బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు. భారీ బడ్జెట్‏తో నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన సొంతం చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 10న రూ. 400 కోట్ల మార్క్ అధిగమించినట్లుగా మేకర్స్ ప్రకటించారు. రజనీకాంత్ 2.0, కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా తర్వాత ఈ ఘనత సాధించిచన మూడో చిత్రంగా నిలిచింది.

పొన్నియన్ సెల్వన్ నిర్మాతల ప్రకారం, ఈ చిత్రం USA, UK, ఆస్ట్రేలియా, సింగపూర్ , మలేషియాలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అటు కర్ణాటకలోనూ పొన్నియిన్ సెల్వన్ మంచి వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఇది నిజంగానే ఒక తమిళ సినిమాకు దక్కిన భారీ విజయం. ఇక పొన్నియిన్ సెల్వన్ రెండో భాగాన్ని ఆరు నుంచి తొమ్మిది నెలల్లో విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ మణిరత్నం ప్రకటించారు. ఈ పార్ట్ 2 వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలోకి రానుంది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ మూవీ రూపొందించారు డైరెక్టర్ మణి. ఇందులో ఐశ్వర్య రాయ్, చియాన్ విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ ప్రధాన పాత్రలు పోషించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.