AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టినరోజు నాడే మరణించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ?.. మరణానికి ముందే తన చావు కబురు చెప్పినా !!..

14 ఏళ్ల వయసులోనే ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పింది తరుణి సచ్‌దేవ్. చిన్న వయసులోనే ఎన్నో విజయాలు అందుకుని సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసింది. తన గురించి తెలుసుకుందామా.

పుట్టినరోజు నాడే మరణించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా ?.. మరణానికి ముందే తన చావు కబురు చెప్పినా !!..
Taruni Sachdev
Rajitha Chanti
|

Updated on: Oct 11, 2022 | 1:48 PM

Share

తన అమాకత్వంతో ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్న చైల్డ్ ఆర్టిస్ట్స్ అనేక మంది ఉన్నారు. బాలనటులుగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి.. ప్రస్తుతం హీరోహీరోయిన్లుగా వెలుగుతున్నవారు చాలా మంది ఉన్నారు. కానీ ఎంతో ప్రతిభ ఉన్న కొందరు నటీనటులు అనుహ్యంగా తనువు చాలించారు. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ తరుణి సచ్‌దేవ్ ఒకరు. చిన్నప్పుడు ఎన్నో చిత్రాల్లో నటించిన తనకు పెద్దయ్యాక సినిమలు, సీరియల్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశమే రాలేదు. ఎవరు ఈ చిన్నారి అనుకుంటున్నారా ? తన పేరు ఎవరికీ అంతగా తెలియకపోవచ్చు.. కానీ రస్నా గర్ల్ అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు. 14 ఏళ్ల వయసులోనే ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పింది తరుణి సచ్‌దేవ్. చిన్న వయసులోనే ఎన్నో విజయాలు అందుకుని సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసింది. తన గురించి తెలుసుకుందామా.

1998 మే 14న ముంబైలో జన్మించింది తరుణి సచ్‌దేవ్. చిన్నవయుసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె తల్లి గీతా సచ్‌దేవ్ ముంబాయిలోని ఇస్కాన్ లోని రాధా గోపీనాథ్ ఆలయానికి చెందిన భక్తజన సంఘంలో సభ్యురాలు. ఈ ఆలయ ఉత్సావాల్లో తరుణి సచ్‌దేవ్ అనేక నాటకాల్లో పాల్గోనేది. ఐదేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రస్నా, కోల్గేట్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ మొబైల్, గోల్డ్ విన్నర్, శక్తి మసాలా వంటి అనేక టిలివిజన్ ప్రకటన్లలో నటించింది. ముఖ్యంగా రస్నా యాడ్‏లో బబ్లీ స్మైల్‏తో ఐ లవ్ యూ రస్నా అని చెప్పి తెగ ఫేమస్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా తరుణి సచ్‌దేవ్ క్రేజ్ మారిపోయింది.

బాలీవుడ్ స్టార్స్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అమితాబ్, షారుఖ్, కరిష్మా వంటి స్టార్స్ తో కలిసి నటించింది. ముఖ్యంగా అమితాబ్ తో కలిసి పా చిత్రంలో నటించింది,. షారుఖ్ నటించిన షో క్యా ఆప్ పంచ్వీ పాస్ సే తేజ్ హై లో పాల్గోంది. 2004లో వెళ్లినక్షత్రం సినిమా ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అనుహ్యంగా ఈ లోకానికి వీడ్కోలు చెప్పింది. విషాదమేంటంటే.. పుట్టినరోజే తనకు చివరి రోజుగా మారింది. 14 మే 2012 తన తల్లి గీతా సచ్‌దేవ్ తో కలిసి నేపాల్ కు వెళ్తుండగా.. ఎయిర్ ఫ్లైట్ సిహెచ్ టీ విమానం కూలిపోయింది.

ఇవి కూడా చదవండి
Taruni

Taruni

ఈ ప్రమాదంలో తరుణి.. ఆమె తల్లి గీతా ఇద్దరూ మరణించారు. అయితే మరణానికి ముందు గీతా స్నేహితులకు వీడ్కోలు పలుకుతూ.. వారిని కౌగిలించుకుని ఇదే మిమ్నల్ని చివరిసారిగా కలుస్తున్నాను ఇక అని చెప్పిందని ఆమె స్నేహితులు గుర్తుచేసుకున్నారు. అలాగే ఫ్లైట్ లో ఉండగా.. తన స్నేహితుడికి మనం ఫ్లైట్ లో ఉన్నప్పుడు విమానం కూలిపోతే అని మేసేజ్ చేసిందని తెలిపారు. ఇక అదే సమయంలో విమానం కూలి ఆ ప్రమాదంలో తరుణి.. ఆమె తల్లి మరణించారు. ఇప్పటికీ ప్రేక్షకులకు రస్నా గర్ల్ గా మనసులలో చెరగని ముద్ర వేసుకుంది.