Samantha: ఇంత అందగా ఉన్నారేంటీ మేడమ్ మీరు.. చీరకట్టులో మాయ చేస్తోన్న సమంత..
ఇక కొంతకాలంగా ఆమె మయోసైటిస్ సమస్యతో పోరాడుతుంది. ఓవైపు ఈ సమస్యకు చికిత్స తీసుకుంటూనే మరోవైపు బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ప్రస్తుతం ఆమె ఖుషి చిత్రీకరణలో పాల్గొంటుంది. అలాగే బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ సిరీస్ లో నటిస్తోంది.

తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ప్రేక్షకుల హృదయాలను దొచేసింది హీరోయిన్ సమంత. ఏమాయ చేసావే అంటూనే తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుని నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే సినీ కెరీర్ ఎంతగా సక్సెస్ అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రేమ, పెళ్లి, విడాకులు సామ్ జీవితాన్ని మలుపు తిప్పాయి. ఇక కొంతకాలంగా ఆమె మయోసైటిస్ సమస్యతో పోరాడుతుంది. ఓవైపు ఈ సమస్యకు చికిత్స తీసుకుంటూనే మరోవైపు బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ప్రస్తుతం ఆమె ఖుషి చిత్రీకరణలో పాల్గొంటుంది. అలాగే బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ సిరీస్ లో నటిస్తోంది.
ఇక ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో మెప్పిచిన సామ్.. అటు హాలీవుడ్ లోనూ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఆమె చెన్నై స్టోరీ చిత్రానికి ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను తమిళంతోపాటు.. ఇంగ్లీష్ లోనూ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చెన్నై స్టోరీనే కాదు.. చెన్నై అమెరికా లవ్ స్టోరీ అంటూ లీకైంది. ఇది ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. తమిళ్, ఇంగ్లీష్ లో చేయడం వెనక స్టోరీ ప్లాట్ మెయిన్ రీజన్ గా తెలుస్తోంది.




తాజాగా వినిపిస్తోన్న సమాచారం ఈ సినిమాలో లండన్ అబ్బాయి, చెన్నై అమ్మాయి మధ్య ప్రేమకథ అని తెలుస్తోంది. ఇందులో సమంత పాత్ర న్యాచురల్ గా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలో తాజాగా సామ్ షేర్ చేసిన బ్యూటీఫుల్ ఫోటో ఆకట్టుకుంటుంది. చాలా కాలం తర్వాత చీరకట్టులో ఉన్న పిక్ షేర్ చేసింది. అందులో సామ్ మరింత అందంగా కనిపిస్తుంది. దీంతో సామ్ న్యూలుక్ లవ్ అమెరికా కోసమే అని అంటున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా సామ్ షేర్ చేసిన లేటేస్ట్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.