AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: ‘నందమూరి సింహం.. రికార్డ్స్ బద్దలు కొట్టే మొనగాడు’.. బాలయ్య పై నోయల్ పాడిన ర్యాప్ సాంగ్ విన్నారా ?..

బాలయ్య బర్త్ డే సందర్భంగా.. ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా.. సింగర్ నోయల్ సేన్ ఓ ర్యాప్ సాంగ్ తీర్చిదిద్దాడు. బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ పాటను యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు. నోయల్ స్వయంగా రాసి ఆలపించిన ఈ పాటకు ప్రదీప్ సాగర్ స్వరాలు సమకూర్చాడు.

Balakrishna: 'నందమూరి సింహం.. రికార్డ్స్ బద్దలు కొట్టే మొనగాడు'.. బాలయ్య పై నోయల్ పాడిన ర్యాప్ సాంగ్ విన్నారా ?..
Jai Balayya
Rajitha Chanti
|

Updated on: Jun 10, 2023 | 8:27 AM

Share

నందమూరి తారకరామారావు నటవారసుడిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు బాలకృష్ణ. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నటవారసులలో టాప్ హీరో అనిపించుకున్న తొలి కథానాయకుడు. ఆయన కెరీర్‏లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, సూపర్ హిట్స్ చిత్రాలున్నాయి. 1984లో డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు సినిమా హీరోగా టర్న్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన నటించిన చిత్రాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈరోజు (జూన్ 10న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బాలయ్య బర్త్ డే సందర్భంగా.. ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా.. సింగర్ నోయల్ సేన్ ఓ ర్యాప్ సాంగ్ తీర్చిదిద్దాడు. బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ పాటను యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు. నోయల్ స్వయంగా రాసి ఆలపించిన ఈ పాటకు ప్రదీప్ సాగర్ స్వరాలు సమకూర్చాడు. “నందమూరి సింహం వచ్చే సూడు.. “అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంటుంది. తాజాగా ఈపాట విన్న అభిమానులు జై బాలయ్య అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే .. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో కాజల్, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈరోజు బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..