Sharwanand: గ్రాండ్గా టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి రిసెప్షన్.. నూతన దంపతులకు కేటీఆర్ బ్లెస్సింగ్స్..
ఇక జూన్ 9న శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, సినీ హీరో విక్టరీ వెంకటేష్ తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈనెల 3న రక్షితా రెడ్డి మెడలో మూడు మూళ్లు వేశారు. వీరిద్దరి వివాహం రాజస్థాన్ జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు, సినీ ప్రముఖులు హజరయ్యారు. ఇక జూన్ 9న శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, సినీ హీరో విక్టరీ వెంకటేష్ తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
అదే సమయంలో రిసెప్షన్ కు వచ్చిన అతిథులు కేటీఆర్ తో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. వివాహనికి ఆహ్వనిస్తూ శర్వానంద్ స్వయంగా ప్రగతి భవన్ కు వెళ్లి ఎంపీ సంతోష్ కుమార్ కు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆ తర్వాత రిసెప్షన్ కు ఆహ్వానిస్తూ సీఎం కేసీఆర్ ను కలిసి ఇన్విటేషన్ ఇచ్చారు శర్వానంద్.




ఇక ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కొణిదెల స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. భార్యతో కలిసి శర్వానంద్ రిసెప్షన్ కు హాజరైన రామ్ చరణ్.. ఉపాసన చెయ్యి పట్టుకొని నడిపించిన తీరు అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వీరి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
Honorable Minister @KTRBRS garu, Victory @VenkyMama Garu & Honorable MP @SantoshKumarBRS Garu attended Hero @ImSharwanand & #Rakshita ‘s reception and blessed the lovely couple. ??#SharwaRakshitaWedding #Sharwanand pic.twitter.com/B5smTo2CCi
— Shreyas Media (@shreyasgroup) June 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.