Adipurush: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఆదివారం ఓపెన్ కానున్న ‘ఆదిపురుష్’ అడ్వాన్స్ బుకింగ్స్..
జూన్ 16న ఈ సినిమా తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం నుంచి ఓపెన్ కానున్నాయని చిత్రయూనిట్ వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలకు, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ సినిమా త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. డైరెక్టర్ ఓంరౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. వెండితెరపై తొలిసారి రాముడి పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను చూసేందుకు ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆదిపురుష్ సినిమా రిలీజ్ కోసం ప్రపంచమే వెయిట్ చేస్తుంది. జూన్ 16న ఈ సినిమా తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం నుంచి ఓపెన్ కానున్నాయని చిత్రయూనిట్ వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలకు, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
రామాయణం ఇతిహాసం ఆధారంగా వస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా… సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఇక రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తుండగా.. అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఇక తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మొత్తం తొమ్మిది భారీ యాక్షన్ విజువల్ సన్నివేశాలు ఉన్నాయట. అవి ప్రేక్షకులను ఎంతో థ్రిల్ చేయడంతోపాటు. ప్రారంభ, ఇంటర్వెల్ పతాక సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయని అంటున్నారు.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.