- Telugu News Photo Gallery Cinema photos Vignesh Shivan Emotional post About his wife Nayanthara and their twins child regarding first wedding anniversary
Nayanthara: నయనతార, విఘ్నేష్ ల మొదటి పెళ్లిరోజు.. పిల్లలతో అందమైన ఫొటోలు..
ఈ సందర్భంగా తమ కవల పిల్లలతో నయన్ నవ్వుతూ, సంతోషంగా ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు నయన్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Updated on: Jun 10, 2023 | 7:16 AM

. సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ పెళ్లిపీటలెక్కి శుక్రవారం (జూన్ 8)తో ఏడాది పూర్తయ్యింది. ఈక్రమంలో తమ పెళ్లి రోజును పురస్కరించుకుని డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.

ఈ సందర్భంగా తమ కవల పిల్లలతో నయన్ నవ్వుతూ, సంతోషంగా ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు నయన్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నువ్వు నా జీవితంలోకి వచ్చి అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. అయినా నాకు నిన్ననే వివాహం అయినట్లు ఉంది. లవ్ యూ తంగమై. మన ప్రయాణాన్ని ప్రేమ, ఆశీర్వాదాలతో మొదలుపెట్టాం.మనం ఇంకా చాలా దూరం కలిసి ప్రయాణించాలి. ఎన్నో సాధించాల్సినవి ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో ఎన్నో సమస్యలను కలిసే ఎదుర్కొన్నాం' అని రాసుకొచ్చాడు డైరెక్టర్ విఘ్నేశ్

'నా పనిలో భాగంగా ఎన్ని చికాకులు ఉన్నా ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత నిన్నూ, పిల్లల్ని చూడగానే అన్నీ మర్చిపోతాను. కుటుంబం ఇచ్చే బలం ఎవ్వరూ ఇవ్వలేరు. మన పిల్లలు ఉయిర్, ఉలగమ్ లకు మంచి జీవితాన్ని అందించడానికి ట్రై చేస్తాను' అని ఎమోషనల్ అయ్యాడు నయన్ భర్త.

కాగా గతేడాది అక్టోబర్ నెలలో నయన్- విఘ్నేశ్ దంపతులకు సరోగసి పద్దతిలో ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. వీరికి ఉయిర్ రుద్రోనిల్ ఎన్. శివన్, ఉలగ్ దైవగన్ ఎన్. శివన్ అని పేర్లు పెట్టుకున్నారు.





























