Samantha: ‘హనుమాన్’ సినిమాపై సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. తేజ సజ్జా టీంకు స్పెషల్ విషెస్..

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న అడియన్స్ ముందుకు రాబోతుంది. కొద్దిరోజులుగా చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. హైదరాబాద్ టూ ముంబై వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. అటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ హనుమాన్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ ప్రీ బుకింగ్స్ లో సెన్సెషన్ సృష్టిస్తోంది ఈ సినిమా.

Samantha: 'హనుమాన్' సినిమాపై సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. తేజ సజ్జా టీంకు స్పెషల్ విషెస్..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 11, 2024 | 7:00 PM

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా హనుమాన్. ఇటీవలి కాలంలో ఈ మూవీ సంచనలం సృష్టిస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న అడియన్స్ ముందుకు రాబోతుంది. కొద్దిరోజులుగా చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. హైదరాబాద్ టూ ముంబై వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. అటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ హనుమాన్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ ప్రీ బుకింగ్స్ లో సెన్సెషన్ సృష్టిస్తోంది ఈ సినిమా. అయితే ఈసారి సంక్రాంతికి ఏకంగా నాలుగు చిత్రాలు పోటీ పడనున్నాయి. సైంధవ్, నా సామిరంగ, గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇందులో సైంధవ్ జనవరి 13న, నా సామిరంగ జనవరి 14న రిలీజ్ కానున్నాయి. కానీ మహేష్, తేజ సజ్జా చిత్రాలు మాత్రం ఒకేరోజున విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సినీ ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా హనుమాన్ సినిమాకు విషెస్ తెలిపుతూ పోస్ట్ చేసింది హీరోయిన్ సమంత తన ఇన్ స్టా స్టోరీలో హనుమాన్ సినిమా టీంకు.. తేజ సజ్జకు శుభాకాంక్షలు తెలిపింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా, మెగాస్టార్ చిరంజీవి నిలబడి గదా పట్టుకున్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

Hanuman Movie

Hanuman Movie

గతంలో సమంత నటించిన ఓ బేబీ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు తేజ సజ్జా. అంతకు ముందు బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన తేజా.. ఓబేబీ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా మెప్పించాడు. 2021లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జాంబీ రెడ్డి సినిమాలో నటించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఇది. ఇందులో అమృత అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించారు. హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి కడంగట్ల నిర్మించగా.. కృష్ణ సురేష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?