- Telugu News Photo Gallery Cinema photos Ravi Teja Eagle movie may get tough fight at box office from Lal Salaam, Tillu Square
Eagle: ఫిబ్రవరిలోనూ తగ్గని పోటీ.. మరి ఈగల్ పరిస్థితి ఏంటి ??
సంక్రాంతి బరిలో తప్పుకున్న సినిమాకు భారీ హామీ ఇచ్చింది ఫిలిం చాంబర్. ఎవరైతే డేట్ అడ్జస్ట్ చేసుకుంటారో వాళ్లకు సోలో డేట్ ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చింది. ఆ నమ్మకంతోనే ఈగల్ టీమ్ వెనక్కి తగ్గింది, పోటి నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9న మూవీ రిలీజ్ అంటూ కొత్త డేట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా ఈగల్‌కు సోలోగా దొరికే పరిస్థితి కనిపించటం లేదు. రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఈగల్. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు మేకర్స్.
Updated on: Jan 11, 2024 | 7:42 PM

సంక్రాంతి బరిలో తప్పుకున్న సినిమాకు భారీ హామీ ఇచ్చింది ఫిలిం చాంబర్. ఎవరైతే డేట్ అడ్జస్ట్ చేసుకుంటారో వాళ్లకు సోలో డేట్ ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చింది. ఆ నమ్మకంతోనే ఈగల్ టీమ్ వెనక్కి తగ్గింది, పోటి నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9న మూవీ రిలీజ్ అంటూ కొత్త డేట్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా ఈగల్‌కు సోలోగా దొరికే పరిస్థితి కనిపించటం లేదు.

రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఈగల్. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు మేకర్స్. కానీ చాంబర్ పెద్దల సంప్రదింపులతో సీన్ మారింది. ఈగల్ కాస్త వెనక్కి తగ్గి ఫిబ్రవరి 9న మూవీ రిలీజ్ చేసేందుకు ఓకే చెప్పింది. సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటే నెక్ట్స్ సోలో డేట్ ఇప్పిస్తామన్న చాంబర్ హామీతో ఈగల్ టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది.

కానీ ఇప్పుడు పరిస్థితి అలా కనిపించటం లేదు. ఈగల్ డేట్ ఎనౌన్స్‌మెంట్ కన్నా ముందే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ చాలా సినిమాలు ఖర్చీఫ్స్ వేశాయి. ఫిబ్రవరి 8న యాత్ర 2 రిలీజ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 9న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు టిల్లు స్క్వేర్, ఊరి పేరు భైరవ కోన సినిమాలు డేట్ లాక్ చేశాయి. అయితే ఈ సినిమాల ప్రమోషన్ స్పీడందుకోకపోవటంతో నిన్న మొన్నటి వరకు ఆ సినిమాలు వాయిదా పడతాయేమో అన్న డౌట్స్ ఉండేవి.

కానీ ఈగల్ ఫిబ్రవరి 9న వస్తున్నట్టుగా ఎనౌన్స్ అయిన తరువాత కూడా ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు వెనక్కి తగ్గలేదు. రీసెంట్‌గా తమిళ డబ్బింగ్ మూవీ లాల్ సలాం ఫిబ్రవరి 9నే రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేసింది. తాజాగా ఊరిపేరు భైరవకోన టీమ్ కూడా రిలీజ్ డేట్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆ డేట్‌కి కూడా ఈగల్‌కి క్లాష్ తప్పేలా లేదు.

సంక్రాంతి బరిలో భారీ కాంపిటీషన్ ఉందని తప్పుకున్నా... నెక్ట్స్ డేట్‌కి కూడా మినిమమ్ నాలుగు సినిమాలతో పోటి పడక తప్పని సిచ్యుయేషన్‌లో ఉంది ఈగల్. మరి ఈ విషయంలో చాంబర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? మిగతా మూవీ టీమ్స్‌తో మాట్లాడి డేట్స్ అడ్జస్ట్ చేయిస్తారా..?లేదంటే మరోసారి ఈగల్ టీమ్ బిగ్ క్లాష్ ఫేస్ చేయాల్సిందేనా? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.




