Pushpa 2: ‘మై జీనియస్ సుక్కూ డార్లింగ్’.. లెక్కల మాస్టారి ఎడిటెడ్ ఫొటోస్ షేర్ చేసిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారడంలో సుకుమార్ సహకారం కూడా చాలా ఉంది. కెరీర్ ఆరంభంలో అల్లు అర్జున్‌కు ఆర్య, ఆర్య 2 వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు సుకుమార్. ఇక సుక్కూ తెరకెక్కించిన పుష్పతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇదే సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం కూడా అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ స్పెషల్ విషెస్ తెలిపారు.
దర్శకుడు సుకుమార్‌కు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో డిమాండ్ ఉంది. ‘పుష్ప’ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆయన పాపులారిటీ బాగా పెరిగింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడీ లెక్కల మాస్టర్ . ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గురువారం (జనవరి 11) దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన దర్శకుడికి స్పెషల్ విషెస్ తెలిపాడు. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారడంలో సుకుమార్ సహకారం కూడా చాలా ఉంది. కెరీర్ ఆరంభంలో అల్లు అర్జున్‌కు ఆర్య, ఆర్య 2 వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు సుకుమార్. ఇక సుక్కూ తెరకెక్కించిన పుష్పతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇదే సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం కూడా అందుకున్నాడు. ఈ నేపథ్యంలో సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ స్పెషల్ విషెస్ తెలిపారు. ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ సెట్స్‌లో తీసిన ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలో అల్లు అర్జున్, సుకుమార్ మధ్య డీప్ డిస్కషన్ జరుగుతోంది. అల్లు అర్జున్ ఈ ఫోటోకు ‘నా జీనియస్ సుక్కు డార్లింగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే తానే క్లిక్ చేసి ఎడిట్ చేసిన కొన్ని ఫొటోలను మరో ట్వీట్‌లో షేర్ చేశాడు.
‘పుష్ప 2’ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, డాలీ ధనంజయ్, అనసూయ, సునీల్, జగదీశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న పుష్ప2 విడుదల కానుంది.
పుష్ప 2 సెట్ లో అల్లు అర్జున్, సుకుమార్..
Happy Birthday to My Genius Sukku Darling #Sukumar pic.twitter.com/ni8c0vu8OZ
— Allu Arjun (@alluarjun) January 11, 2024
లెక్కల మాస్టారి ఎడిటెడ్ ఫొటోస్..
Some of the pics I clicked & Edited of u . You look your best now . Happy Birthday 🖤 #sukumar pic.twitter.com/q5PemETXSx
— Allu Arjun (@alluarjun) January 11, 2024
ఆర్య 2 సెట్ లో..
14 Years of Arya2 . A Film that will always be very Spl & close to my heart 🖤 #14YearsForArya2 pic.twitter.com/urwlKyP1cJ
— Allu Arjun (@alluarjun) November 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.