Sai Pallavi: బాలీవుడ్‌లోకి లేడీ పవర్‌ స్టార్‌.. సూపర్‌స్టార్‌ కుమారుడితో సాయి పల్లవి.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్

గతేడాది విరాట పర్వం, గార్గి సినిమాల్లో నటించింది సాయి పల్లవి. అయితే వీటి తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదీ నేచురల్‌ బ్యూటీ. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన సాయి పల్లవి సొంతంగా ఆస్పత్రి ఏర్పాటుచేస్తుందని, సినిమాలు చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్లేనని తేలిపోయింది. శివకార్తికేయన్‌తో కలిసి ఓ కొత్త మూవీలో నటిస్తోంది సాయి పల్లవి. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై లోకనాయకుడు కమల్ హాసన్‌ ఈ మూవీని నిర్మిస్తుండడం విశేషం

Sai Pallavi: బాలీవుడ్‌లోకి లేడీ పవర్‌ స్టార్‌.. సూపర్‌స్టార్‌ కుమారుడితో సాయి పల్లవి.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్
Junaid Khan, Sai Pallavi
Follow us
Basha Shek

|

Updated on: Sep 14, 2023 | 8:15 AM

గతేడాది విరాట పర్వం, గార్గి సినిమాల్లో నటించింది సాయి పల్లవి. అయితే వీటి తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదీ నేచురల్‌ బ్యూటీ. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన సాయి పల్లవి సొంతంగా ఆస్పత్రి ఏర్పాటుచేస్తుందని, సినిమాలు చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్లేనని తేలిపోయింది. శివకార్తికేయన్‌తో కలిసి ఓ కొత్త మూవీలో నటిస్తోంది సాయి పల్లవి. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై లోకనాయకుడు కమల్ హాసన్‌ ఈ మూవీని నిర్మిస్తుండడం విశేషం. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ఈ మూవీ మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే ఈ నేచురల్‌ బ్యూటీకి బాలీవుడ్‌ ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. కాగా ఆమిర్‌ ఖాన్‌ ప్రస్తుతం సినిమాలేవీ చేయడం లేదు. ఆయన నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రం భారీ అంచనాలతో రిలీజై పరాజయం పాలైంది. దీంతో సినిమాల నుంచి కొన్ని రోజుల పాటు బ్రేక్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన కుమారుడు జునైద్‌ఖాన్‌ సినిమాల్లోకి రానుందని వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక సమాచారం వెలువడనుంది.

ఇవి కూడా చదవండి

సాయి పల్లవి, జునైద్ ఖాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించనున్నారు. ‘జునైద్ సినిమా సిద్ధమైంది. ఆ సినిమాలో సాయి పల్లవికి జోడీగా జునైద్ నటించే అవకాశం ఉంది. ఓ చక్కటి ప్రేమకథా చిత్రం ఇది. యశ్ రాజ్ ఫిలింస్ తో సినిమా తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది’ అని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సినిమాను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌ నిర్మిస్తుండడం విశేషం. ఇక జునైద్ ఖాన్‌కు థియేటర్‌ రంగంలో అనుభవం ఉంది. అతను అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్‌లో రెండేళ్లపాటు శిక్షణ పొందాడు. అలాగే కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లోనూ నటించాడు. అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమాకు జునైద్ ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. ఆ అనుభవాలన్నింటినీ ఉంచుకుని నటుడిగా రంగుల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. అమీర్ ఖాన్ తరహాలో జునైద్ కూడా సక్సెస్ అవుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

అమర్ నాథ్ యాత్రలో సాయి పల్లవి..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.