Ustaad Bhagat Singh: పవన్ వచ్చేశాడు.. ఉస్తాద్ భగత్‌సింగ్ నయా షెడ్యూల్ స్టార్ట్.. ఫొటోస్ వైరల్
ఇటీవలే 'ఓజీ' గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించిన పవన్ తాజాగా మరో కిక్కు ఇచ్చే న్యూస్ చెప్పాడు. ఉస్తాద్ భగత్‌సింగ్ సెట్స్‌లోకి ఎంటరయ్యాడు. అలాగే ఈ మూవీకి సంబంధించిన నయా షెడ్యూల్ కూడా స్టార్ట్ అయ్యింది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్‌లో పవన్ కల్యాణ్‌తో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న హరీష్ శంకర్.
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ మూవీలో లాగే ఇందులో స్టైలిష్ పోలీస్‌గా కనిపించనున్నాడు పవర్ స్టార్. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే ‘ఓజీ’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించిన పవన్ తాజాగా మరో కిక్కు ఇచ్చే న్యూస్ చెప్పాడు. ఉస్తాద్ భగత్‌సింగ్ సెట్స్‌లోకి ఎంటరయ్యాడు. అలాగే ఈ మూవీకి సంబంధించిన నయా షెడ్యూల్ కూడా స్టార్ట్ అయ్యింది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్‌లో పవన్ కల్యాణ్‌తో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న హరీష్ శంకర్.. ‘పవన్‌తో తనది షరతులు లేని బంధం. ఆయనను ఇంతకంటే ఏమి అడగలం’ అని రాసుకొచ్చాడు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ నయా షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జరుగుతోందని మేకర్స్ వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా పవన్‌కు గతంలో సూపర్‌హిట్ పాటలు అందించిన దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటి గౌతమి, అశుతోష్ రాణా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కాగా ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్నారు పవన్ కల్యాణ్. ఇప్పటికే వారాహి యాత్రలో పాల్గొంటున్నాడు. అలాగే తీరిక దొరికనప్పుడల్లా సినిమా షూటింగ్స్‌కు హాజరువుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు సుజిత్‌తో ఓజీ సినిమా చేస్తున్నాడు. అలాగే క్రిష్ జాగర్ల మూడి డైరెక్షన్‌లో హరిహరవీరమల్లులో నటిస్తున్నాడు. అలాగే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కూడా ఓ సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్
View this post on Instagram
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ లుక్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.