AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story Movie : సమంత వదిలిన సారంగదారియా సాంగ్.. ఆకట్టుకుంటున్న లవ్ స్టోరీ సినిమా పాట

టాలీవుడ్ లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. అందమైన ప్రేమకథలు తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల దిట్ట. డాలర్ డ్రీమ్ అనే సినిమా తో ఎంట్రీ..

Love Story Movie : సమంత వదిలిన సారంగదారియా సాంగ్.. ఆకట్టుకుంటున్న లవ్ స్టోరీ సినిమా పాట
Rajeev Rayala
| Edited By: Surya Kala|

Updated on: Mar 01, 2021 | 7:11 PM

Share

Love Story Movie : టాలీవుడ్ లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. అందమైన ప్రేమకథలు తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల దిట్ట. డాలర్ డ్రీమ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శేఖర్ కమ్ముల. ఆతర్వాత ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమాతో పేక్షకులను అలరించి సక్సెస్ సాధించాడు. ఆతర్వాత గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్, ఫిదా వంటి అందమైన కథలతో ఆకట్టుకున్నాడు. ఇక ఫిదా సినిమా సృషించిన సంచలనం అంతా ఇంతా కాదు.

ఈ సినిమా శేఖర్ కమ్ముల కెరియర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ సాయిపల్లవి తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ చైతన్యతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లవ్ స్టోరీ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సాయిపల్లవి చైతన్యతో జత కట్టింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో హీరో హీరోయిన్లు ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచాయి.

తాజాగా ఈ సినిమాను మరో పాటను విడుదల చేశారు. ‘సారంగా దారియా ‘అంటూ సాగే ఈ పాటను అక్కినేని కోడలు పిల్ల సమంత విడుదల చేసారు. సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ పాటను మంగ్లీ ఆలపించారు. పవన్ సీఏచ్ . ఈ సినిమాకు సంగీతమే అందించారు. దాని కుడి భుజం మీద కడువా అంటూ అచ్చమైన తెలంగాణ జానపదంగా సుద్దాల అశోక్ తేజ రచించారు. ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ దాస్ కె.నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా ఉన్నారు. మరిన్ని ఇక్కడ చదవండి : 

Shanmukh Jaswanth Deepthi Sunaina: దీప్తితో బ్రేకప్ అయ్యిందా..? షణ్ముఖ్‌ జశ్వంత్ సోషల్ మీడియా లైవ్‌లో క్లారిటీ ఇచ్చేశాడు

Ameesha Patel: చెక్‌ బౌన్స్‌ కేసుపై స్పందించిన అమీషా పటేల్‌.. ఈన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తార..