AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ameesha Patel: చెక్‌ బౌన్స్‌ కేసుపై స్పందించిన అమీషా పటేల్‌.. ఈన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తార..

Ameesha Patel: ప్రముఖ బాలీవుడ్‌ నటి అమీషా పటేల్‌ చెక్‌ బౌన్స్‌ కేసులో ఇరుక్కున్నారన్న వార్త శనివారం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. రూ.2.5 కోట్ల రూపాయల చెక్‌ బౌన్స్‌ కేసులో ఆమెపై కోర్టులో పిటిషన్‌ దాఖలైందంటూ వార్తలు వచ్చాయి...

Ameesha Patel: చెక్‌ బౌన్స్‌ కేసుపై స్పందించిన అమీషా పటేల్‌.. ఈన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తార..
Narender Vaitla
|

Updated on: Feb 28, 2021 | 10:07 AM

Share

Ameesha Patel: ప్రముఖ బాలీవుడ్‌ నటి అమీషా పటేల్‌ చెక్‌ బౌన్స్‌ కేసులో ఇరుక్కున్నారన్న వార్త శనివారం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. రూ.2.5 కోట్ల రూపాయల చెక్‌ బౌన్స్‌ కేసులో ఆమెపై కోర్టులో పిటిషన్‌ దాఖలైందంటూ వార్తలు వచ్చాయి. అజయ్‌ కుమార్‌ సింగ్‌ అనే వ్యక్తి అమీషాపై ఈ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ విషయమై అమీషా పటేల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా అమీషా పటేల్‌.. ‘ఒక పబ్లిక్‌ ఫిగర్‌గా నేను నా వృత్తిపరంగా, వ్యక్తిగతం నిత్యం ఏదో ఒక పుకారును వింటూనే ఉంటాను. గతంలో నాపై వచ్చిన పుకార్లను చూస్తునే ఉంటాను. కమాన్‌ గాయ్స్‌.. దేవుడు ఇచ్చిన ఈ అందమైన జీవితంలోని ప్రతీ క్షణాన్ని ఆస్వాదించండి. అచ్చంగా నేను చేస్తున్నాట్లుగానే. ఛీర్స్‌.. ‘ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ఈ లెక్కన చెక్‌బౌన్స్‌ కేసు కూడా తనపై వస్తోన్న పుకారు అని చెప్పకనే చెప్పింది అమీషా. ఇదిలా ఉంటే.. అజయ్‌ కుమార్‌ సింగ్‌ 2017లో అమీషాను కలిసి ఓ సినిమాలో పెట్టుబడి పెట్టే విషయంలో మాట్లాడినట్లు… ఈ క్రమంలో ‘దేశీ మ్యాజిక్’ అనే చిత్రం కోసం అమీషా, అజ‌య్‌ని బ‌ల‌వంతంగా పెట్టుబ‌డి పెట్టేలా చేసింద‌ని.. ఇందుకోసం తాను అమీషా అకౌంట్‌కి రూ.2.5కోట్లు బ‌దిలీ చేసిన‌ట్లు అజ‌య్ తన పిటిష‌న్‌లో పేర్కొన్నారు. అనంతరం ఆ సినిమా అనివార్య కారణాలతో మధ్యలో ఆగిపోవడంతో తాను డ‌బ్బులు అడిగాన‌ని.. అప్పుడు అమీషా త‌న‌కు చెక్ ఇచ్చింద‌ని అజ‌య్ అన్నారు. అయితే ఆ చెక్ బౌన్స్ అయ్యింద‌ని ఆయ‌న ఆరోపించారు. అమీషాపై దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జార్ఖండ్‌ హైకోర్టు జ‌డ్జ్ ఆనంద్ సేన్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచారించారు. ఈ సందర్భంగా ఇరువురి వాదనలు విన్న కోర్టు వారి వాదనలకు సంబంధించి రెండు వారాల్లో పూర్వ స‌మాధానం కావాల‌ని జ‌డ్జి కోరిన‌ట్లు తెలుస్తోంది. మరి ఈ చెక్‌ బౌన్స్‌ కేసు ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

Also Read: Abhishek Bachchan : పేరులో మార్పులు చేసుకున్న బాలీవుడ్ టాప్ హీరో.. కారణం ఏంటో తెలుసా..

Telugu contestants in Indian Idol : ఇండియన్ ఐడల్ లో పాల్గొని తమ ప్రతిభ చూపించిన తెలుగు గాయనీగాయకులు ఎవరంటే..