Kangana Ranaut: ట్విట్టర్‌ నన్ను చూసి భయపడుతోంది. నేను ఏది మాట్లాడినా అది దేశం కోసమే.. కంగానా ఆసక్తికర వ్యాఖ్యలు.

Kangana Ranaut Tweet: కంగనా రనౌత్‌... సినిమాలపై అవగాహన లేని వారికి కూడా ఇప్పుడు ఈ పేరు తెలియదనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం తర్వాత పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..

Kangana Ranaut: ట్విట్టర్‌ నన్ను చూసి భయపడుతోంది. నేను ఏది మాట్లాడినా అది దేశం కోసమే.. కంగానా ఆసక్తికర వ్యాఖ్యలు.
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 28, 2021 | 12:08 PM

Kangana Ranaut Tweet: కంగనా రనౌత్‌… సినిమాలపై అవగాహన లేని వారికి కూడా ఇప్పుడు ఈ పేరు తెలియదనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం తర్వాత పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ లైమ్‌లైట్‌లోకి వచ్చిన కంగానా అనంతరం కాంట్రవర్సీల చుట్టూ సావాసం చేస్తూనే ఉంది. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ పోస్ట్‌తో నెట్టింట కంగనా రచ్చ చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల ట్విట్టర్‌ వేదికగా చేస్తోన్న కొన్ని ట్వీట్‌లు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ట్విట్టర్‌ పలుమార్లు కంగనా చేస్తోన్న ట్వీట్లపై స్పందించింది కూడా. ఈ నేపథ్యంలో కంగానా చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. ఇక తాజాగా ట్విట్టర్‌ కంగనా అకౌంట్‌ను షాడో బ్యాన్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్‌.. ‘హే ట్విట్టర్‌ ‘కంగనా టీమ్‌’ను ఎందుకు షాడో బ్యాన్‌ చేశారు’ అంటూ చేసిన ట్వీట్‌ స్క్రీన్‌ షార్ట్‌ను పోస్ట్‌ చేసిన కంగనా.. ‘జాక్‌ చాచా (ట్విట్టర్‌ సీఈఓ జాక్‌ డోర్సీని ఉద్దేశిస్తూ), అతని బృందం భావ వ్యక్తీకరణ చేసినందుకు నా ట్విట్టర్‌ ఖాతాను షాడో బ్యాన్‌ చేశారు. వారు నన్ను చూసి భయపడుతున్నారు. వారు నన్ను పూర్తిగా బ్యాన్‌ చేయలేదు అలాగని ఉంచడానికి అనుమతించలేరు అయినా నేను ట్విట్టర్‌లో ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికో.. నన్ను నేను ప్రమోట్‌ చేసుకోవడానికో ఇక్కడ లేను. నేను ఏది మాట్లాడినా అది దేశం కోసమే. దాన్ని వారు సహించలేకపోతున్నారు’ అంటూ ట్వీట్‌ చేసిందీ ఫైర్‌ బ్రాండ్‌.

Also Read: Shanmukh Jaswanth Deepthi Sunaina: దీప్తి, షణ్ముఖ్‌ జశ్వంత్ మధ్య రిలేషన్ ఏంటి..? ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందా..?

Karthika Deepam Vantalakka : హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని వంటలక్క ఆస్తులు.. విలువ ఎంతో తెలుసా..!